Begin typing your search above and press return to search.
బ్రహ్మాస్త్ర బడ్జెట్ లెక్కల గందరగోళం.. అదన్నమాట సంగతి
By: Tupaki Desk | 19 Sep 2022 8:00 AM GMTబాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీగానే వసూళ్లను సాధించిందని చెప్పాలి. వరుసగా రెండు వారాల పాటు వసూళ్లు ఆశించినదాని కంటే.. ఊహించినదాని కంటే కూడా ఎక్కువగా వస్తున్నాయి అనేది బాక్సాఫీస్ వర్గాల మాట.
ఎంతగా వసూళ్లు చేసినా కూడా సినిమా బ్రేక్ ఈవెన్ అనేది సాధ్యం కాదని అంతా అంటున్నారు. ఎందుకంటే సినిమా కు నాలుగు వందల కోట్లు ఖర్చు చేశారు అంటూ కొందరు అంటూ ఉంటే.. కంగనా రనౌత్ ఫ్యాన్స్ ఏకంగా ఆరు వందల కోట్లకు పైగానే ఈ సినిమాకు దర్శకుడు అయాన్ ముఖర్జీ ఖర్చు చేశాడు అంటూ ఆరోపిస్తున్నారు.
మొత్తానికి బ్రహ్మాస్త్ర సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు అనేది నిజం. కనుక ఇప్పుడు మూడు వందల కోట్ల వసూళ్లు నమోదు అయినా బ్రేక్ ఈవెన్ అనేది సాధ్యం కాదు.
అయితే ఈ సినిమా యొక్క బడ్జెట్ గురించి వస్తున్న వార్తలు గందరగోళానికి గురి చేస్తున్న నేపథ్యంలో హీరో రణబీర్ కపూర్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.
ఈ సినిమాను తాము మూడు పార్ట్ లు గా చిత్రీకరించబోతున్న విషయం తెల్సిందే. మూడు పార్ట్ ల కోసం భారీ సెట్టింగ్స్ ను వినియోగిస్తాం.. వీఎఫ్‌ఎక్స్ కూడా మూడు పార్ట్ లకు కలిపి చేయించడం జరిగింది. కనుక ఇప్పుడు ఈ శివ పార్ట్ కి బడ్జెట్ ఎక్కువ అయినా కూడా ముందు ముందు రాబోతున్న పార్ట్ లకు బడ్జెట్ చాలా తక్కువ అవుతుంది.
కనుక ఇప్పుడు బడ్జెట్ అంత అయ్యింది.. వసూళ్లు ఇంత వచ్చాయి అనే లెక్కలు వేయడం అవివేకం అన్నట్లుగా రణబీర్ కపూర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో బాలీవుడ్ మీడియా అతిగా స్పందించడం ఇకనైనా ఆపేయాలంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూడు పార్ట్ లు పూర్తి అయ్యి విడుదల అయ్యిన తర్వాత కానీ ఈ లెక్కలు తేలే అవకాశం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.