Begin typing your search above and press return to search.

ఆమెపై నాకు మాత్రమే హక్కు ఉంది-రణ్ బీర్

By:  Tupaki Desk   |   25 Oct 2016 11:30 AM GMT
ఆమెపై నాకు మాత్రమే హక్కు ఉంది-రణ్ బీర్
X
ప్రేమలో ఉన్నవారిలో ఒక అబ్బాయి కానీ, అమ్మాయి కానీ తన పార్ట్ నర్ గురించి మాట్లాడుతూ... "వారు నాకే సొంతం.. వారిపై నాకు మాత్రమే హక్కుంది" అని అన్నారంటే... వ్యవహారం ఇరువైపులా కాస్త ముదిరినట్లే భావించాలి!! ఈ సమయంలో బాలీవుడ్ లవర్ బోయ్ రణ్ బీర్ కపూర్ కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాడు... తన కొత్త గర్ల్ ఫ్రెండ్ విషయాలపై స్పందిస్తూ "ఆమె పై నాకు మాత్రమే హక్కుంది" అని చెప్పేస్తున్నాడు.

లండన్ బ్యూటీ కత్రినా కైఫ్ తో బ్రేకప్ తర్వాత బాలీవుడ్ లవర్ బోయ్ రణ్‌బీర్ కపూర్ కొత్త గాళ్ ఫ్రెండ్ ను సెలెక్ట్ చేసుకునే పనిలో బిజీగా మారిపోయాడని చాలా గాసిప్స్ వచ్చాయి. ఆపని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యిందో ఏమో మనోడు ఈ మధ్య శ్రీలంక సుందరి జాక్వెలీన్ ఫెర్నాండేజ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని వార్తలొస్తున్నాయి. అయితే... కత్రినా కైఫ్ అనంతరం సౌత్ బ్యూటీ శృతి హాసన్ పేరు తెరపైకి వచ్చినా, అతి తక్కువ సమయంలోనే అదంతా పుకారే అని తేలిపోయిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో కత్రినా తో విడిపోయాక జాక్వెలీన్ తో బాబు చాలా క్లోజ్ గా ఉంటున్నాడని - వీరిద్దరూ కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నారని వార్తలు షికారు చేశాయి.

ఈ క్రమంలో తాజాగా తన కొత్త సినిమా "యే దిల్ హై ముష్కిల్" ప్రమోషన్స్ లో భాగంగా ఓ రియాల్టీ షోకు హాజరైన రణ్ వీర్ ఇదే విషయమై లేటెస్ట్ గా స్పందించాడు. జాక్వెలీన్ తో ఉన్న అనుబంధం గురించి చెప్పండి అన్న ప్రశ్నకు... "వన్‌ సైడ్‌ లవ్ కి ఉన్న పవరే వేరు.. మిగతా సంబంధాల్లా ఇద్దరి మధ్య విడిపోవడం అనేది ఉండదు.. అలాగే జాక్వెలీన్‌ పై నాకు మాత్రమే హక్కు ఉంది" అంటూ కామెంట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ డైలాగ్‌ బీటౌన్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జాక్వెలీన్ పై ఏకంగా తనకు మాత్రమే హక్కు ఉందడనడంతో వ్యవహారం ముదిరి పాకాన పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/