Begin typing your search above and press return to search.
చీటింగ్ గేమ్ పై ఓపెనైన కుర్రహీరో!
By: Tupaki Desk | 5 Sep 2019 5:36 AM GMTఒకరికి మనసిచ్చి.. ఇంకొకరితో ప్రేమలో పడడాన్ని ఏమని అంటారు? సింపుల్ గా `చీటర్` అనే ఒక్క పదం చాలదూ?... నిలదీయడానికి. ఒక అమ్మడితో నిండా ప్రేమలో మునిగి .. వేరొక సెట్ కి వెళ్లగానే అక్కడ ఇంకో అందగత్తెతో లవ్ లో పడిపోవడం అంటే ఎంత ఛీప్ గా ఉంటుందో కదా! అయితే నిజమైన ప్రేమ అంతరించిపోతున్న ఈ రోజుల్లో పాశ్చాత్య ధోరణి పెరిగిపోతున్న ఈ కలికాలంలో ఆ కుర్రహీరోలోనూ అలాంటి దారితప్పిన ప్రేమ చివరికి పశ్చాత్తాపపడే వరకూ వెళ్లింది మరి. ఏదో ఆకర్షణకు గురయ్యాడులే పాపం అనుకోవడానికి లేదిక్కడ.
ఈ మొత్తం ఎపిసోడ్స్ లో ఆ కుర్రహీరో చివరికి పశ్చాత్తాపంతో చాలా కుంగిపోయాడు. చాలా కాలం ఒంటిరివాడైపోయాడు. ఆ రియలైజేషన్ తోనే తాను చేసిన తప్పును అంగీకరించాడు. ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో దాగుడు మూతలు ఆడడం నా తప్పేనని నిజాయితీగా ఒప్పుకున్నాడు. ప్రేమలో నమ్మకం అనేది ముఖ్యం. అదే సిసలైన పునాది. జీవితానికి అర్థం అంటూ ఆ కుర్రహీరో లెంపలు వాయించుకున్నాడు.
ఇంతకీ ఎవరా కుర్రహీరో .. పేరు చెప్పకూడదా? అంటే... అందరికీ తెలిసిన చాక్లెట్ బోయ్ రణబీర్ కపూర్ గురించే ఇదంతా. తొలుత అందాల దీపిక పదుకొనేతో ప్రేమాయణం సాగించిన రణబీర్ ఆ తర్వాత అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ (2010) సెట్ లో కత్రినతో లవ్ లో పడ్డాడు. ఫలితంగా మనస్ఫర్థలతో దీపిక నుంచి విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తనని ఎంతో నిజాయితీగా ప్రేమించిన తొలి ప్రేయసి విషయంలో రియలైజ్ అయ్యాడు. అనంతరం ఓ పబ్లిక్ వేదిక సాక్షిగా..``అవును నేను చీట్ చేశాను. ఇప్పుడు రియలైజయ్యాను. నా తప్పు తెలిసింది`` అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
ఒక సినిమా కథకు ఏమాత్రం తగ్గని ఈ లవ్ స్టోరి ముగింపు ఎలా ఉంది? అంటే .. ప్రస్తుతం ఇద్దరితో లవ్ లో పడి ఆ ఇద్దరి నుంచి విడిపోయాక .. ఇప్పుడు మరో యంగ్ బ్యూటీతో లవ్ లో ఉన్నాడు. సదరు యంగ్ బ్యూటీ సైతం ఇప్పటికే ఒకరికి టాటా చెప్పి ప్రస్తుతం ఈ డేటింగుల హీరోతో లవ్ లో ఉంది. ఇంతకీ ఎవరు చెప్మా? అని సందేహ పడొద్దు. ఈ బ్యూటీ ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా భట్ అన్న సంగతి అందరికీ తెలుసు. ఇకపోతే రణబీర్ ని ప్రేమించిన పాపానికి మనసు విరిగిపోయాక తనకు ప్రపోజ్ చేసిన వేరొక యంగ్ ఎనర్జిటిక్ హీరో రణవీర్ ని పెళ్లాడేసింది దీపిక. ముగ్గురు నలుగురి చుట్టూ మొత్తం ఐదారు ప్రేమకథలు ఎంతో సినిమాటిగ్గా డ్రమటిగ్గా ఉన్నాయనిపించడం లేదూ? ఇలాంటి ప్రేమకథలు బాలీవుడ్ చుట్టూ కోకొల్లలు. డీటెయిల్డ్ గా పరిశీలిస్తే..!