Begin typing your search above and press return to search.

ఆలియాపై ప్ర‌స్టేష‌న్.. కానీ స‌మ్మ‌ర్ లో పెళ్లి ఫిక్స్!

By:  Tupaki Desk   |   30 Nov 2021 4:42 AM GMT
ఆలియాపై ప్ర‌స్టేష‌న్.. కానీ స‌మ్మ‌ర్ లో పెళ్లి ఫిక్స్!
X
ర‌ణ‌బీర్ క‌పూర్-ఆలియా భ‌ట్ ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. ఈ జంట త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్కుతున్నార‌ని చాలా కాలంగా క‌థ‌నాలొస్తున్నాయి. కానీ ఇంకా ఇంకా ఇది ఆల‌స్య‌మ‌వుతోంది. వివాహం గురించి అడిగితే ర‌ణ‌బీర్ మౌనంగా ఉంటాడు. అలియా భ‌ట్ చిన్న న‌వ్వుతో స‌రిపెడుతోంది. దాదాపు ఏడాది కాలంగా ఇద్ద‌రి మ‌ధ్య ఇదే తంతు న‌డుస్తోంది. ఒకానొక స‌మ‌యంలో అలియాభ‌ట్ ర‌ణ‌బీర్ తీరుపై అస‌హ‌నాన్ని కూడా వ్య‌క్తం చేసింది. ర‌ణ‌బీర్ మ‌రో న‌టితో కూడా క్లోజ్ గా మూవ్ అవుతూ డ‌బుల్ గేమ్ ఆడుతున్నాడ‌నే క‌థ‌నాలు బాలీవుడ్ మీడియాలో తెర‌పైకి వ‌చ్చాయి.

తాజాగా అలియాభ‌ట్ ధ‌రించిన లెహంగాను ర‌ణ‌బీర్ కోపంతో త‌న్నుతున్న ఓ వీడియో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. దీపావ‌ళి పండుగ‌ను ఈ జంట క‌లిపి సెల‌బ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. అందులో ర‌ణ‌బీర్ చాలా కోపంగా క‌నిపిస్తున్నాడు. లెహంగా దుస్తుల్లో అలియాభ‌ట్ మెట్లు దిగి వ‌స్తుండ‌గా ఆమె డ్రెస్ మెట్లు ద‌గ్గ‌ర ఉన్న పూల కుండీల‌ను తాకింది. దీంతో వెంట‌నే ఆ లెహంగాను కాలితో కోపంగా త‌న్నిన‌ట్లు హైలైట్ అయింది. మ‌రి ఇది కోపంతో చేసినా ప‌నా? లేక? లెహంగాను పూల కుండీ నుంచి త‌ప్పించాల‌ని అలా చేసారా? అన్న‌ది అర్థం కాని సంగ‌తి.

దీంతో నెటి జ‌నులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌క‌ర‌కాల సంద‌హాలు వ్య‌క్తం చేస్తున్నారు. ర‌ణ‌బీర్ లెహంగాని కాలితో కాకుండా చేతితో తీయోచ్చు క‌దా. పూల‌ను కాలితో త‌న్న‌కూడ‌దు అన్న విష‌యం ఆయ‌న గారికి తెలియ‌దంటారా? అలా చేయ‌లేదంటే అది అలియ‌భ‌ట్ పై ఉన్న కోపమే అనుకోవ‌చ్చేమో! అని సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అలియాతో క‌లిసి ఫోటోలు దిగుతున్న‌ప్పుడు ర‌ణ‌బీర్ కాస్త అస‌హ‌నంగా క‌నిపించిన‌ట్లు భావిస్తున్నారు.

ఆ సంగ‌తిని ప‌క్క‌న‌బెడితే! విక్కీ కౌశ‌ల్-క‌త్రినా కైఫ్ డిసెంబ‌ర్ లో వివాహం చేసుకుంటున్న నేప‌థ్యంలో ఆలియా-ర‌ణ‌బీర్ కూడా పెళ్లి చేసుకుంటున్న‌ట్లు మ‌ళ్లీ ప్ర‌చారం తారా స్థాయికి చేరింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ జంట కూడా డిసెంబ‌ర్లోనే వివాహం చేసుకోవాల‌ని అనుకున్నారుట‌. కానీ క‌రోనా కొత్త వేరియంట్ కార‌ణంగా వాయిదా వేసుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్పుడు పెళ్లి హ‌డావుడి పెట్టుకుంటే సినిమా షూటింగ్ ల‌కు ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని...స‌రైన స‌మ‌యం చూసుకుని డెస్టినేష‌న్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో ముహుర్తం పెట్టుకోవ‌చ్చ‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.