Begin typing your search above and press return to search.
ప్లే బాయ్ కాని మంచి బాయ్
By: Tupaki Desk | 28 Sep 2021 11:30 AM GMTసినిమా బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ ఉంటే ఇండస్ట్రీలో అడుగు పెట్టడం చాలా సులభం. ఇండస్ట్రీ సూపర్ స్టార్ వారసులు అయితే ఎంట్రీ ఇవ్వకుండానే స్టార్స్ గా గుర్తింపు వస్తుంది. అలాంటి స్టార్ డమ్ రణబీర్ కపూర్ కు దక్కింది. ముత్తాత పృథ్వీరాజ్ కపూర్.. తాత రాజ్ కపూర్.. తండ్రి రిషి కపూర్ లు బాలీవుడ్ ను ఏలేసిన స్టార్స.. అమ్మ నీతూ సింగ్ కూడా బాలీవుడ్ లో వెలుగు వెలిగిన తార. అంత మంది తారల నుండి వచ్చిన రణబీర్ కపూర్ సావరియా సినిమా తో బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన సావరియా సినిమాతో పరిచయం అయిన రణబీర్ కపూర్ ఆ తర్వాత వెను దిరిగి చూసుకోకుండా మంచి సక్సెస్ లు దక్కించుకున్నాడు.
మొదటి సినిమా వరకే తాతల, తల్లిదండ్రుల పేరును ఉపయోగించుకున్న రణబీర్ కపూర్ ఆ తర్వాత తన ట్యాలెంట్ తో స్టార్ డమ్ ను నిలుపుకున్నాడు. బాలీవుడ్ లో ఆయన చేసిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. అందుకే ఆయన స్టార్ గా వెలుగు వెలిగి పోతున్నాడు. అయితే హీరోగా మంచి పేరు దక్కించుకున్న రణబీర్ కపూర్ వ్యక్తిగత జీవితంలో మాత్రం విలన్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఈయన ప్లే బాయ్ అని.. తనతో నటించిన ప్రతి హీరోయిన్ ను తన బుట్టలో పడేసుకునేందుకు ప్రయత్నించేవాడని.. ఈయన ప్రేమ కథల లెక్కలు తేలాలంటే చాలా సమయం పడుతుంది అనేది బాలీవుడ్ మీడియా టాక్.
బాలీవుడ్ మీడియా రణబీర్ కపూర్ ప్రేమ కథలను కుప్పలు తెప్పలుగా ప్రసారం చేయడం జరిగింది. తన కంటే పెద్ద వయసు వారితో కూడా ప్రేమాయణం సాగించి వారితో రొమాన్స్ చేసిన ఘనత ఈ కపూర్ వారసుడికి మాత్రమే దక్కుతుంది. దీపికా పదుకునే.. కత్రీనా కైఫ్ తో పాటు మరి కొందరు ముద్దుగుమ్మలు కూడా ఈయన ప్రేమలో మునిగి తేలిన వారే. ప్రేమ కథలను ఎంత ఈజీగా మొదలు పెడతాడో అంతే ఈజీగా ఈయన తన ప్రేమకు బ్రేకప్ చెప్తాడు అనేది టాక్. ప్రస్తుతం ఈయన ఆలియా భట్ తో ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరి ప్రేమ కథ షురూ అయ్యి కాస్త ఎక్కువ రోజులో అయ్యింది. కనుక ఈసారి ఆలియా భట్ ను పెళ్లి చేసుకుంటాడేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరి జోడీకి అనూహ్య స్పందన వస్తుంది.
సినిమాలో హీరోగా పేరు దక్కించుకున్న రణబీర్ కపూర్ రియల్ లైఫ్ లో హీరోయిన్స్ విషయంలో ప్లే బాయ్ గా పేరు దక్కించుకున్నాడు. అయితే ఆ విషయంలో లవ్ బాయ్ అయినా ప్లేబాయ్ అయినా కావచ్చు. కాని ఇతర విషయాల్లో మాత్రం ఆయన చాలా సున్నిత మనష్కుడు.. అందరిని చాలా గౌరవించే వ్యక్తి అంటూ బాలీవుడ్ లో టాక్ ఉంది. నిలకడ లేని కారణంగా అన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి. కాని అతడి తప్పు ఏమీ లేదు అనేది కొందరి మాట. హీరోగా మంచి పాత్రలు చేసినట్లుగానే నిజ జీవితంలో కూడా రణబీర్ కపూర్ ఎన్నో మంచి పనులు చేశాడు అనేది ఆయన సన్నిహితుల మాట. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు నెటిజన్స్ అందరు కూడా రణబీర్ కపూర్ ను పుట్టిన రోజు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.