Begin typing your search above and press return to search.
‘ఎక్స్’ వద్దంటే వద్దనేశాడట
By: Tupaki Desk | 2 Nov 2016 4:46 AM GMTసినీ నటుల ప్రేమలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక.. బాలీవుడ్ ప్రేమ జంటల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హైదరాబాద్ లో వర్షం ఎప్పుడు కురుస్తుందో తెలీని చందంగా.. బీ టౌన్ లో ఎప్పుడు ఎవరు ఎవరిని ప్రేమిస్తారో.. ఎవరు ఎవరికి బ్రేకప్ చెబుతారో చెప్పలేని పరిస్థితి. ప్రేమ మైకంలో ఉన్నప్పుడు..పగలు రాత్రి అన్న తేడా లేకుండా తమ ప్రేమను పొంగించే ప్రేమపక్షులు.. కాస్త తేడా వచ్చినా ఎంతలా మారిపోతారో ఎన్నో జంటల్ని ఇప్పటికే చేతల్లో చూపించేశాయి. తాజాగా అలాంటి ముచ్చటే ఒకటి చోటు చేసుకుందట.
హాట్ హాట్ అందాలతో కుర్రకారు మనసుల్ని దోచేసి.. ట్రైలర్ తో నిద్ర లేని రాత్రిళ్లను మిగిల్చిన హాట్ ఆంటీ ఐష్ నటించిన తాజా చిత్రం.. ‘‘యే దిల్ హై ముష్కిల్’’. ఈ సినిమాలో హీరో రణబీర్ కపూర్ అయినా.. అతడి కంటే..ఐష్ గురించే అందరూ మాట్లాడుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలకు ముందు వేసిన ప్రీమియర్ షోకు.. ఈ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ కు సన్నిహితురాలు.. రణ్ బీర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కత్రినా కైఫ్ రాకపోవటం ఆసక్తికరంగా మారింది. అయితే.. కత్రినా గైర్హాజరీ వెనుక.. అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు.
కత్రినాతో బ్రేకప్ అయిన తర్వాత.. ఆమెకు దూరంగా ఉంటున్న రణ్ బీర్.. తన తాజా చిత్ర ప్రీమియర్ షోకు కత్రినాకు పిలవొద్దని నిర్మాత కరణ్ కు చెప్పాడట. ఆమె కానీ వస్తే.. తనకు సౌకర్యవంతంగా ఉండదని.. అందుకే ఆమెను ఇన్వైట్ చేయొద్దని తేల్చేశాడట రణ్ బీర్. అందుకే కరణ్.. కత్రినాను పిలవలేదని చెబుతున్నారు. ఎక్స్ అయిన తర్వాత కూడా మరీ అంత ఇబ్బందికరం ఏమిటో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/