Begin typing your search above and press return to search.
ఆలియాతో పెళ్లి.. రణబీర్ ఏమన్నాడంటే.?
By: Tupaki Desk | 22 Aug 2018 12:01 PM GMTబాలీవుడ్ ప్లేబాయ్.. టాప్ హీరో రణ్ బీర్ కపూర్.. చొక్కాలు మార్చినంత సులువుగా ప్రేయసిలను మార్చేస్తాడని బాలీవుడ్ లో ఓ టాక్ ఉంది.. అప్పట్లో కత్రినా కైఫ్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. ఆ తర్వాత ఆమెతో బ్రేక్ అప్ అయ్యి దీపికా పడుకొనేతో ప్రేమలో మునిగాడు. అదీ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు తాజా బాలీవుడ్ క్యూట్ గర్ల్ ఆలియా భట్ తో డేటింగ్ లో ఉన్నాడు. ఇలా తన పర్సనల్ లైఫ్ లో హీరోయిన్లను మార్చడమే పనిగా పెట్టుకున్న రణబీర్ సినిమాల విషయంలో మాత్రం హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు. ఈ మధ్యే సంజు సినిమాతో గ్రాండ్ హిట్ కొట్టి స్టార్ హీరోగా అవతరించాడు. సినిమాల పరంగా పీక్ స్టేజ్ కు వెళ్లిపోగా.. వ్యక్తిగతంగా మాత్రం రణబీర్ రోమాంటిక్ యాంగిల్ పై బాలీవుడ్ లో బోలెడు గాసిప్స్ వెలువడుతున్నాయి.
తాజాగా ఆలియా, రణబీర్ త్వరలోనే పెళ్లిచేసుకుంటున్నారని.. కాదు కాదు.. వీరి పెళ్లి అయిపోయిందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన రణబీర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
రణబీర్ మాట్లాడుతూ.. ‘సినిమాలు, నటన విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. ఆలియా చాలా నచ్చింది. ఆమెతో సంబంధం కొత్తగా ఉంది.’ అంటూ కొత్త ప్రేయసి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇక ఆలియాతో పెళ్లి అయిపోయిందనే రూమర్లపై రణబీర్ స్పందించాడు. ‘అవన్నీ పుకార్లే.. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. నాకు 35 ఏళ్లు . పెళ్లి చేసుకునే వయసే.. ఆలియాతో రిలేషన్ ను ఇంకో లెవల్ కు తీసుకెళ్లాలనుకుంటున్నా.. కానీ ఎప్పుడనేది కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి ఆలియాతో నాకు పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదు’ అని క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం రణబీర్ చేతిలో క్రేజీ ప్రాజెక్టు ఉంది. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ ‘ యే జవానీ హై దివానీ’ అనే సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రణబీర్ - ఆలియా కలిసి నటిస్తున్నారు. అమితాబ్ - నాగార్జున కీలక పాత్రధారులు. ఈ చిత్రం కోసం రణబీర్ - ఆలియా బిజీగా ఉన్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది.