Begin typing your search above and press return to search.

ఆ ప్రేమ గువ్వ‌ల బ్రేక‌ప్ వెన‌క‌ మ‌మ్మీ గారి కుట్ర‌

By:  Tupaki Desk   |   25 April 2020 3:45 AM GMT
ఆ ప్రేమ గువ్వ‌ల బ్రేక‌ప్ వెన‌క‌ మ‌మ్మీ గారి కుట్ర‌
X
దీపిక ప‌దుకొనే- ర‌ణ‌బీర్ జంట ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. ర‌ణ‌బీర్ న‌ట‌జీవితంతో పాటు వ్య‌క్తిగ‌త జీవితం ఎప్పుడూ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్. ముఖ్యంగా దీపిక నుంచి అత‌డు విడిపోయిన ఘ‌ట్టంపై ఎప్ప‌టికీ అభిమానులు మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే ఈ జంట విడిపోవ‌డానికి ర‌ణ‌బీర్ త‌ల్లి నీతూ క‌పూర్ కార‌ణ‌మా? అంటే.. దానికి ర‌ణ‌బీర్ చెప్పిన స‌మాధానం ఆస‌క్తిక‌రం. ఇంత‌కీ ఏం చెప్పాడు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

ర‌ణ‌బీర్ - దీపిక మ‌ధ్య స్నేహం `బచ్నా ఏ హసీనో` చిత్రీకరణ సమయంలో బ‌ల‌ప‌డింది. ఆ క్ర‌మంలోనే ఆ ఇద్ద‌రూ డేటింగ్ ప్రారంభించారు. అయితే.. ఈ జంట ఒకటిన్నర సంవత్సరాల తరువాత అనూహ్యంగా విడిపోయారు. ఈ జంట విడిపోవ‌డానికి కార‌ణం కత్రిన రంగ ప్ర‌వేశం అంటూ వాడి వేడిగా ఇండ‌స్ట్రీలో టాక్ వినిపించింది. 2009 లో `అజాబ్ ప్రేమ్ కి గజాబ్ కహానీ` సెట్స్ లో కత్రినా కైఫ్‌తో ర‌ణ‌బీర్ ప్రేమ‌ వ్యవహారంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఇదే ప్రశ్నను ఓ ఇంట‌ర్వ్యూలో లేవనెత్తినప్పుడు, రణబీర్ మాట్లాడుతూ ``దీపిక ఇప్పటికీ నా స్నేహితురాలు. మేము ఎందుకు విడిపోయాము అన్న‌ది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. మా అనుబంధంపై గౌరవం ఉంది. ఆమె ఒక అమ్మాయి కాబట్టి.. భవిష్యత్తులో వివాహం చేసుకుంటుంది కాబట్టి త‌న‌ గురించి ఇలాంటి విషయాలు మాట్లాడటం.. నేను త‌న‌ను అగౌరవపరచడం ఇష్టం లేదు`` అని తెలిపాడు.

దీపికతో విడిపోవడానికి మీ త‌ల్లి గారైన‌ నీతు కపూర్ కారణమని వార్త‌లొచ్చాయి క‌దా! అన్న ప్ర‌శ్న‌కు.. రణబీర్ స‌మాధాన‌మిచ్చారు. అస‌లు త‌న ప్రేమ బ్రేక‌ప్ వ్య‌వ‌హారం లో త‌న త‌ల్లిగారి ప్ర‌మేయం లేనే లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు. ``ఇది ఇద్దరు ప్రేమికుల మధ్య సమస్య. కానీ మీడియా.. జ‌నం అనేక ఇత‌ర విషయాల్ని యాడ్ చేసి అస‌లు విష‌యాన్ని త‌ప్పు దారి ప‌ట్టిస్తారు. సంబంధాల‌ను భంగపరుస్తారు. నా తల్లి నన్ను చాలా ప్రేమిస్తుంది. తాను ఎందుక‌లా చేస్తుంది? నేను నా స్వంత జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. మా అమ్మ గారికి కూడా దీపిక అంటే చాలా ఇష్టం. మేం విడిపోవడానికి అమ్మ గారు అస‌లు కారణం కాదు`` అని తెలిపారు.

2005 లో `బ్లాక్` చిత్రం కోసం ద‌ర్శ‌కుడు సంజయ్ లీలా భన్సాలీకి సహాయం చేయడం ద్వారా ర‌ణ‌బీర్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. సోనమ్ కపూర్ తో కలిసి 2007 లో భన్సాలీ తెర‌కెక్కించిన `సావరియా`తో డెబ్యూ క‌థానాయ‌కుడిగా రంగ ప్ర‌వేశం చేశాడు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డంలో .. బాక్సాఫీస్ మేజిక్ సృష్టించడంలో విఫలమైంది. క్రిటిక‌ల్ గా.. వాణిజ్యపరంగానూ విఫ‌ల‌మైంది. రణబీర్ 2009 లో వేక్ అప్ సిడ్ -అజాబ్ ప్రేమ్ కి గజాబ్ కహానీ చిత్రాలలో న‌టించాడు. తనదైన‌ నటనతో పాపులారిటీని పెంచుకున్నాడు. అటుపై నటుడిగా వెనుతిరిగి చూసిందే లేదు. రాక్‌స్టార్- బర్ఫీ- యే జవానీ హై దీవానీ- తమషా- ఏ దిల్ హై ముష్కిల్- సంజు.. ఇంకా చాలా చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు.

తన తొలి చిత్రం `సావరియా` ఫ్లాప్ కావడం గురించి మాట్లాడుతూ ``ఈ చిత్రం బాగా ఆడ‌లేదని అందరికీ తెలుసు. కానీ ఈ చిత్రం కోసం చాలా ప్రేమతో.. కష్టపడి ప‌ని చేశాం. ఈ రోజు నేను ఉన్నాను అంటే అది సంజయ్ లీలా భన్సాలీ వల్లనే. నటన .. సినిమాల గురించి నాకు ఏమైనా తెలుసు అంటే అది నేను అతని నుండి నేర్చుకున్న‌దే. సావారియా వైఫ‌ల్యం నాకు విచారం కలిగించే అనుభవం కాదు. నేను ఎలాంటి సినిమా తో అరంగేట్రం చేయాలనుకుంటున్నాను అని ఎవరైనా నన్ను అడిగితే.. నేను ఇంకా సావరియా అని చెబుతాను. ఆ చిత్రంలో ముఖ్యంగా టవల్ సీన్ వ‌ల్ల‌ నాకు చాలా మంది అభిమానులేర్ప‌డ్డారు`` అని ర‌ణ‌బీర్ తెలిపారు.