Begin typing your search above and press return to search.

నిజంగానే డబ్బులు తిరిగిస్తావా హీరో??

By:  Tupaki Desk   |   22 July 2017 9:28 AM GMT
నిజంగానే డబ్బులు తిరిగిస్తావా హీరో??
X
ప్రతి సినిమాని నమ్మే నిర్మిస్తారు నమ్మకంతోనే ఆ సినిమాను కొంటారు అంతే నమ్మకంగానే ప్రేక్షకులు థియేటర్లు కు వస్తారు. కాకపోతే అందరి అంచనాలును అందుకోవడం సినిమాలో కష్టమైన పనే. ఈ మధ్య ఒక బాలీవుడ్ సినిమా అలానే వచ్చి అందరిని నిరాశ పరిచింది. సినిమా నిర్మాణం మాత్రం మూడు ఏళ్ళు చేసి అంచనాలు ఆకాశం పై పెట్టి ప్రచారం చేశారు. ప్రేక్షకులు కూడ అన్ని ఏళ్ళు తీసిన ఎలా ఉంటుందో అని ఒక పక్క ఆసక్తి ఉన్న ఎక్కడో ఆ సినిమా పై అనుమానం కూడ ఏర్పాటు చేసుకున్నారు. అది విడుదలై ఆ అనుమానాలును నిజం చేసి ప్రేక్షకులును నిరాశ పరచడమే కాకుండా డిస్ట్రిబూటర్లకు బాగా నష్టాన్ని తెచ్చిపెట్టింది.

రణబీర్ కపూర్ హీరోగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా నిర్మించిన సోసియో ఫాంటసీ ‘జగ్గా జసూస్’ సినిమా నిర్మాణ జాప్యాల మధ్య కిందట వారం ఫైనల్ గా విడుదలైంది. అందరిలానే మా సినిమా హిట్ అని మొదటి రోజు చెప్పుకున్నా మొదటి వారం కలెక్షన్ తో తేలిపోయింది సినిమా ఫలితాలు ఎలా ఉన్నాయనేది. జగ్గా జసూస్ సినిమా నిర్మాణ వ్యయం సుమారుగా 110 కోట్లు ఈ సినిమాను వాళ్ళు 120 కోట్లుకు డిస్ట్రిబూటర్లుకు అమ్మేరు. కాకపోతే ఈ సినిమా మొదటి వారం బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్లు మాత్రం కేవలం 50 కోట్లు నెట్. సాధారంగా ఒక బాలీవుడ్ సినిమాకు మొదటి వారం కలెక్షన్ కనీసం 100 కోట్లు నెట్ వస్తేనే.. రికవరీ సజావుగా ఉంటుంది. లేకపోతే డిస్ట్రిబూటర్లు తీవ్ర నష్టాలు పాలయ్యే ఛాన్సుంది. కాకపోతే సినిమా విడుదల అప్పుడు హీరో రణబీర్ కపూర్ డిస్ట్రిబూటర్లుకు ఒక మాట ఇచ్చాడు “ఈ సినిమాను మేము నమ్మి నిర్మించాము ఫలితాలు ఏమైనా తేడాగా వస్తే మీకు నేను అండగా ఉంటాను. నా కుటంబానికి అటువంటి చరిత్ర ఉంది. మా సినిమా వలన డిస్ట్రిబూటర్లు నష్టం వస్తే ఆ నష్టాన్ని పూరించే బాధ్యత మేము తీసుకుంటాం'' అని చెప్పాడు.

అనురాగ్ బసు డైరెక్ట్ చేసిన జగ్గా జసూస్ సినిమాను డిస్ని వాళ్ళ తో పాటుగా రణబీర్ కూడ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. మరి రణబీర్ కపూర్ తన మాటను నిలబెట్టుకుంటాడా లేక చల్లగా తప్పుకుంటాడా అనేది చూడాలి.