Begin typing your search above and press return to search.
రణబీర్ పాన్ ఇండియా ఆశలు అలా ఆవిరి!
By: Tupaki Desk | 27 July 2022 11:30 PM GMTవరుసగా భారీ పాన్ ఇండియా చిత్రాలతో సౌతిండియాలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు రణబీర్ కపూర్. ఉత్తరాది దక్షిణాది అన్న తేడా లేకుండా దేశమంతా తనను అద్భుత నటుడిగా గుర్తించి అభిమానించాలని అతడు కోరుకుంటున్నాడు. అది తన దివంగత తండ్రి గారు.. ప్రముఖ నుటుడు రిషీ కపూర్ ఆకాంక్ష కూడా. దానిని నెరవేర్చేందుకు రణబీర్ ఎంతో పట్టుదలగా ఉన్నాడు. అందుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. అలుపన్నదే లేకుండా అహోరాత్రులు కష్టపడి పని చేస్తున్నాడు. అంతేకాదు అతడు ఎలాంటి భేషజానికి పోకుండా సౌత్ ప్రముఖులతో స్నేహాన్ని కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా అతడు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడులోనూ గేమ్ ఛేంజర్ కావాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా తొలిగా తన సినిమా `శంషేరా`ను ఇటీవల అత్యంత భారీగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదలైంది.
శంషేరా బిగ్ స్క్రీన్ మసాలా ఎంటర్ టైనర్ అన్న టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్ద వసూళ్లను సాధించడంలో విఫలమైంది. అగ్నిపథ్ ఫేమ్ కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్- సంజయ్ దత్- వాణి కపూర్ తదితరులు నటించారు. ఇది షంషేరా/ బల్లి (టైటిల్) పాత్ర చుట్టూ తిరిగే కథ. రణబీర్ కపూర్ మొదటిసారి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తన గిరిజన తెగకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేని యువకుడిగా తనవారికి కాపాడుకునే నాయకుడిగా రణబీర్ నటించారు. బ్రిటీష్ గూండాలను ఢీకొట్టే వీరుడిగానూ అతడు కనిపించాడు.
భారీ యాక్షన్ కంటెంట్ ఉన్న సినిమా. కానీ ఫర్వాలేదనిపించే వసూళ్లను మాత్రమే దక్కించుకుంది. ఈ మూవీ కోసం పెట్టిన బడ్జెట్ కానీ .. తారాగణం పారితోషికాల రేంజు కానీ ఇతర సాంకేతిక అంశాల కోసం పెట్టిన ఖర్చు కానీ ..పోల్చి చూస్తే సాధించిన వసూళ్లు చాలా చిన్నవి అని విశ్లేషిస్తున్నారు.
శంషేరా చిత్రం రణబీర్ పాన్ ఇండియా ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పుడు అన్ని ప్రైమ్ షోలలో `శంషేరా` స్థానంలో ఏక్ విలన్ రిటర్న్స్ మూవీని రీప్లేస్ చేస్తున్నారు. జూలై 22న థియేటర్లలో విడుదల కాగా కేవలం ఐదు రోజుల్లోనే మూవీ తేలిపోయింది. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ న్యూస్ ట్రేడ్ ఎక్స్ పర్ట్ ఎగ్జిబిటర్ విషేక్ చౌహాన్ వివరాల ప్రకారం.. శంషేరా జీవితకాల మొత్తం రూ.50-55 కోట్ల నికర వసూళ్ల (100 కోట్ల గ్రాస్)ను మాత్రమే సాధిస్తుందని తెలిసింది. నిజానికి శంషేరాకు వచ్చిన హైప్ కి తగ్గ వసూళ్లు ఇవి కావు. దాదాపు 400-500 కోట్లు కొల్లగొట్టాలని ఆశించిన టీమ్ కి ఇది పెద్ద నిరాశ.
ఇంతలోనే ఏక్ విలన్ 2తో శంషేరా థియేటర్లను రీప్లేస్ చేసేస్తుండడంతో ఇక రణబీర్ ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది. జాన్ అబ్రహం- దిశా పటానీ- అర్జున్ కపూర్- తారా సుతారియా తదితరులు నటించిన `ఏక్ విలన్ రిటర్న్స్` విడుదలవుతుండడంతో అన్ని ప్రధాన స్క్రీన్ లలో (సింగిల్ స్క్రీన్ లు - మల్టీప్లెక్స్ లు) రణబీర్ మూవీని తొలగిస్తున్నారు. తొలిగా అన్ని ప్రైమ్ టైమ్ షోలలో ఏక్ విలన్ 2తో రీప్లేస్ చేస్తున్నారు. పెద్ద హాలీవుడ్ మూవీ లేదా సౌత్ సినిమా ఏదీ విడుదల కానందున `ఏక్ విలన్ 2` ఆ లోటును పూడ్చాల్సి వచ్చిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
షంషేరా బాక్సాఫీస్ విషయంలో తీవ్రంగా నిరాశపరిచింది. కపూర్ సినిమాలో ఎక్కడ తప్పు జరిగింది? అంటూ ఇప్పుడు విశ్లేషణలు సాగుతున్నాయి. ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద శంషేరాకు ఆశించినది దక్కలేదు. జస్ట్ ఓకే అనిపించింది. చెత్త సినిమా కాదు.. అలాగని గొప్ప సినిమా కూడా కాదు! అంటూ విశ్లేషకులు తమ విశ్లేషణలను జోడించారు.
YRF బృందం రణబీర్ కపూర్ ని కొత్తగా మాస్ యాక్షన్ అవతార్ లో చూపించి భారీ వసూళ్లను కొల్లగొట్టాలని ప్రయత్నించారు. కానీ రణబీర్ ఇమేజ్ కి ఇలాంటిది సూట్ కాదు. ఒక చారిత్రక ఇతిహాసం తెరకెక్కించేప్పుడు యాక్షన్ జానర్ ని టచ్ చేయని హీరోపై ఇంత పెద్ద బెట్టింగ్ వేయకూడదు. తక్కువ బడ్జెట్ తో సమకాలీన యాక్షన్ చిత్రంగా ప్రయత్నించి ఉంటే బాగుండేది. అనవసరంగా చాలా డబ్బు వృథా చేశారు! అంటూ పలువురు ట్రేడ్ అనలిస్టులు విశ్లేషించడం విశేషం.
అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నా కానీ ఓపెనింగ్ బాగోలేదు. రణబీర్ త్వరలో పుంజుకుంటాడని ఆశిస్తున్నామని ట్రేడ్ నిపుణులు విశ్లేషించారు. ఇకపోతే రణబీర్ నటించిన మరో భారీ పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర తదుపరి విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ కి కూడా సౌత్ లో మిశ్రమ స్పందనలే వ్యక్తమయ్యాయి తప్ప హైప్ లేదు.. క్రేజ్ అసలే లేదు.