Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్స్ లో స‌త్తా చాటిన మ‌నోడు

By:  Tupaki Desk   |   17 July 2020 9:30 AM GMT
నెట్ ఫ్లిక్స్ లో స‌త్తా చాటిన మ‌నోడు
X
ఓటీటీ వేదిక‌ల మ‌ధ్య ఎంత పోటీ ఉన్నా నెట్ ఫ్లిక్స్ లాంటి టాప్ రేంజ్ ఇంట‌ర్నేష‌న‌ల్ దిగ్గ‌జానికి ఎదురే లేదు. అసాధార‌ణ బ‌డ్జెట్ల‌తో అద్భుత కాంబినేష‌న్ల‌తో సినిమాలు వెబ్ సిరీస్ లు తెర‌కెక్కించి నిరంత‌రం కంటెంట్ ని వేడెక్కించ‌డం ఈ విదేశీ కార్పొరెట్ దిగ్గ‌జానికే చెల్లింది. తెలుగు కంటెంట్ ఎంత ఉన్నా.. ఇత‌ర కంటెంట్ పైనే మ‌న యూత్ మోజు పెంచుకుంటున్నారు? అంటే నెట్ ఫ్లిక్స్ సినిమాలు సిరీస్ ల రేంజు ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ బ‌డా సంస్థ‌ వెబ్ ని ఏ రేంజులో వేడెక్కిస్తోందో ఊహించ‌వ‌చ్చు.

నెట్ ఫ్లిక్స్ అటు బాలీవుడ్ స్టార్లు స‌హా సౌత్ స్టార్ల‌తోనూ సినిమాలు వెబ్ సిరీస్ లు ఒరిజిన‌ల్ సినిమాలు తెర‌కెక్కిస్తూ ఇక్క‌డా పాగా వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్త బిజినెస్ కి బిలియ‌న్ డాల‌ర్ పెట్టుబ‌డుల్ని వెద‌జ‌ల్లుతూ ఇటు మిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేసేందుకు ఈ దిగ్గ‌జ‌ సంస్థ వెన‌కాడ‌డం లేదు.

తొలిసారిగా నెట్ ఫ్లిక్స్ త‌మ వేదిక‌పై అత్యధికంగా చూసిన సినిమాల జాబితాను విడుదల చేసింది. ఇందులో రణదీప్ హుడా అభిమానులకు పండ‌గ వాతావ‌ర‌ణం తెచ్చింది. ర‌ణదీప్ హుడా - రుద్రాక్ జైస్వాల్ ‌లతో కలిసి హాలీవుడ్ ఫేమ‌స్ స్టార్ క్రిస్ హేమ్స్‌వర్త్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ `ఎక్స్ ‌ట్రాక్షన్` చార్ట్ లో టాప్ 1గా నిలిచింది. మొదటి నాలుగు వారాల్లో 99 మిలియన్ల మంది (9 కోట్ల 90ల‌క్ష‌ల మంది) వీక్షకులతో నెట్ ‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ కేట‌గిరీలో టాప్ లెవ‌ల్లో ఆద‌ర‌ణ పొందింది.

రణదీప్ ఈ జాబితాను ట్విట్టర్ ‌లో అభిమానుల‌కు షేర్ చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లైన‌ రస్సో బ్రదర్స్ అలాగే క్రిస్ హేమ్స్ వ‌ర్త్ కి అత‌డు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ఈ జాబితాలో బర్డ్ బాక్స్ - స్పెన్సర్ కాన్ఫిడెన్షియల్ - 6 అండర్ గ్రౌండ్ సినిమాలు ఉన్నాయి. మర్డర్ మిస్టరీ - ది ఐరిష్ - ది ప్లాట్‌ఫాం వంటి సిరీస్ లు ఉన్నాయి. ప్రముఖ హాలీవుడ్ సూపర్ స్టార్స్ క్రిస్ హేమ్స్ వర్త్ .. సాండ్రా బుల్లక్... మార్క్ వాల్బెర్గ్ .. ర్యాన్ రేనాల్డ్స్ వంటి వాళ్లు న‌టించిన‌ యాక్షన్ లేదా థ్రిల్లర్ జోన‌ర్ కి చెందిన సినిమాలు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. కనీసం రెండు నిమిషాల పాటు సినిమా చూసిన వీక్షకుల‌ను ప‌రిగ‌ణించి ఒక సంఖ్య‌గా లెక్కించి ఈ రిపోర్టును అందించింది నెట్ ఫ్లిక్స్.