Begin typing your search above and press return to search.
‘రంగ్ దే’ ఫస్ట్ డే కలెక్షన్స్.. జోరు ఎలా ఉందంటే?
By: Tupaki Desk | 27 March 2021 4:15 AM GMT‘చెక్’ వంటి డిజాస్టర్ తర్వాత కొద్ది గ్యాప్ లోనే విడుదలైన నితిన్ మూవీ రంగ్ దే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను.. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ‘తొలిప్రేమ, ‘మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయడం, మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడంతో మంచి హైప్ వచ్చింది.
ఇక, ట్రైలర్ తో ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ భావన కలిగించారు మేకర్స్. దీంతో.. ఫ్యామిలీ ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. మార్చి 26న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మరో చిత్రం అరణ్యతో కలిసి స్క్రీన్స్ షేర్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా వచ్చాయనేది చూద్దాం.
పోటీగా రెండో చిత్రం రావడంతోపాటు భారత్ బంద్ ఎఫెక్ట్ కూడా కలెక్షన్లపై ప్రభావం పడింది. నిన్నటి భారత్ బంద్ కారణంగా ఆంధ్రలో మార్నింగ్ షోలు రన్ కాలేదు. ఆ విధంగా మ్యాట్నీతో బాక్సాఫీస్ వార్ మొదలైంది. మొదటి షోత్ మంచి హోల్డ్ రాబట్టిన ఈ మూవీ.. ఈవినింగ్ ప్రైమ్ షోలకు మంచి పికప్ అందుకుంది. ఆ విధంగా.. మార్నింగ్ షోలకు దెబ్బపడినా.. బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మెన్స్ చూపించిందని చెప్పొచ్చు.
ఏరియాల వారీగా కలెక్షన్లు చూస్తే.. నైజాంలో 1.54 కోట్లు సాధించిన రంగ్ దే.. వైజాగ్ లో 0.56, ఈస్ట్ లో 0.52, వెస్ట్ లో 0.31, కృష్ణాలో 0.21, గుంటూరులో 0.67, నెల్లూరులో 0.24, సీడెడ్ 0.60 కోట్లు సాధించింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ.. 4.65 కోట్ల షేర్ రాబట్టింది. ముందు ఎలాగో వీకెండ్ ఉండడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.