Begin typing your search above and press return to search.
'భీష్మ' కంటే ఎక్కువగా జరిగిన 'రంగ్ దే' ప్రీ రిలీజ్ బిజినెస్..!
By: Tupaki Desk | 25 March 2021 7:31 AM GMTయూత్ స్టార్ నితిన్ - కీర్తి సురేశ్ జంటగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సినిమా ''రంగ్ దే''. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే బ్యానర్ లో నితిన్ హీరోగా వచ్చిన 'భీష్మ' సూపర్ హిట్ అవడంతో 'రంగ్ దే' పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలతో బజ్ క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
'రంగ్ దే' వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ దాదాపు 25 కోట్ల వరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఇటీవల వచ్చిన నితిన్ 'చెక్' ఆశించిన స్థాయిలో లేనప్పటికీ.. 'రంగ్ దే' ప్రీ రిలీజ్ బిజినెస్ 'భీష్మ' కంటే ఎక్కువగా జరిగింది. నైజాం - 7.20 కోట్లు.. సీడెడ్ - 3.60 కోట్లు.. ఆంధ్రా - 10 కోట్లు - ఓవర్ సీస్ - 2కోట్లు.. రెస్టాప్ ఇండియా - 2కోట్లు కలుపుకుని మొత్తం 24.80 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి 'రంగ్ దే' అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదనిపిస్తున్నాయి. 29న హోళీ కూడా ఉండటంతో సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈ నాలుగు రోజుల వీకెండ్ లో మంచి వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది.