Begin typing your search above and press return to search.

'బస్టాండే బస్టాండే ఇక బ్రతుకే బస్టాండే' అంటూ నితిన్ కి 'రంగ్ దే' మ్యారేజ్ గిఫ్ట్...!

By:  Tupaki Desk   |   26 July 2020 5:20 PM IST
బస్టాండే బస్టాండే ఇక బ్రతుకే బస్టాండే అంటూ నితిన్ కి రంగ్ దే మ్యారేజ్ గిఫ్ట్...!
X
టాలీవుడ్ యువ హీరో నితిన్‌ - షాలినిల వివాహ వేడుక ఈ రోజు రాత్రి 8:30 గంట‌ల‌కు హైద‌రాబాద్‌ లోని ఫ‌ల‌క్‌ నుమా ప్యాలెస్‌ లో వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నితిన్ పెళ్లి వేడుక మరింత గుర్తుండిపోయేలా చేయడానికి ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'రంగ్ దే' చిత్ర యూనిట్ తన మ్యారేజ్ కి ఓ క్యూట్ గిఫ్ట్ ఇవ్వాలని రెడీ అయ్యారు. మరికొన్ని గంటల్లో నితిన్ వివాహం జరగనుండగా తాజాగా 'రంగ్ దే' టీమ్ నితిన్ పెళ్లి కానుక అంటూ టీజర్ రిలీజ్ చేసింది.

కాగా నితిన్ పెళ్లి సందర్భంగా పెళ్ళి చుట్టూ తిరిగే సీన్స్ తోనే టీజర్ కట్ చేసారు. 'పెళ్లి కొడుకు ఎక్కడ?' అంటూ స్టార్ట్ అయిన టీజర్ 'ఏంటి మామయ్య.. నీ బ్రతుకు ఇలా అయిపోయింది' 'చెయ్యి తీయి జస్టిస్ చౌదరి' 'నాన్నా.. నవ్వుతోంది. నేను కట్టలేను.. నాన్నా' అనే డైలాగ్స్ తో ఆద్యంతం ఫన్నీగా సాగింది. 'బస్టాండే బస్టాండే ఇక బ్రతుకే బస్టాండే' నితిన్ కి విషెస్ తెలియజేసింది 'రంగ్ దే' టీమ్. ఈ టీజర్ లో నితిన్ పెళ్లి తర్వాత ఇంటి పనులు చేస్తూ ఎలాంటి కష్టాలు పడ్డాడో కూడా చూపించారు. మొత్తం మీద 'రంగ్ దే' టీమ్ అందించిన క్యూట్ మ్యారేజ్ గిఫ్ట్ అందరిని అలరిస్తోంది. అంతేకాకుండా అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది.

కాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ నరేష్ - కౌశల్య - సత్యం రాజేష్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పటికే విడుదలైన ‘రంగ్ దే’ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకున్న 'రంగ్ దే' త్వరలోనే మళ్ళీ చిత్రీకరణ స్టార్ట్ కానుంది.