Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: అలరిస్తున్న ఫన్నీ కలర్ ఫుల్ ''రంగ్ దే''
By: Tupaki Desk | 19 March 2021 6:36 PM ISTయువ హీరో నితిన్ - కీర్తి సురేశ్ జంటగా నటించిన ''రంగ్ దే'' సినిమా మార్చి 26న థియేటర్లలోకి రానుంది. ఈ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ ఈరోజు కర్నూల్ లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా తాజాగా 'రంగ్ దే' ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'నేను అర్జున్.. దేవుణ్ణి నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ ని ప్రసాదించమని కోరుకున్నాను. కోరుకున్న ఆరో సెకన్ కి ఒక పాప మా కాలనీకి వచ్చింది. అప్పటి నుంచి నా జీవితాన్ని తొక్కడం స్టార్ట్ చేసింది' అంటూ నితిన్ చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమైంది. 'పెంట మీద రాయేస్తే మన బట్టలే పడవుతాయి' అని నితిన్ అంటుండగా.. 'పర్లేదు ఇంటికెళ్లి సర్ఫ్ పెట్టుకొని ఉతుక్కుంటా' అంటూ కీర్తి చెప్పే డైలాగ్ ఫన్నీగా ఉంది. చిన్నప్పటి నుంచే తనని ముప్పుతిప్పలు పెడుతూ వచ్చిన హీరోయిన్ కి కొన్ని అనుకోని పరిస్థితుల్లో తన వల్లే ప్రెగ్నెన్సీ రావడం.. ఇష్టం లేకున్నా ఆమెనే పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత వాళ్ళిద్దరి జీవితంలో చోటుచేసునే సంఘటనలు ఈ ట్రైలర్ లో చూపించారు.
'మనల్ని ప్రేమించేవారి విలువ మనం వాళ్ళని ఒద్దు అనుకున్నప్పుడు కాదు.. వాళ్ళు మనల్ని అక్కర్లేదనుకున్నప్పుడు తెలుస్తుంది' 'గొడవ కలవడానికి చెయ్యి.. గెలవడానికి కాదు' వంటి డైలాగ్స్ బాగున్నాయి. ఈ చిత్రంలో సీనియర్ నరేష్ - వినీత్ - రోహిణి - కౌసల్య - బ్రహ్మాజీ - వెన్నెల కిషోర్ - సత్యం రాజేష్ - అభినవ్ గోమటం - సుహాస్ - గాయత్రి రఘురామ్ వంటి భారీ తారాగణం కనిపిస్తుంది. ఈ ట్రైలర్ పై దేవిశ్రీప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. మొత్తం మీద కలర్ ఫుల్ గా ఉన్న ఫన్ ప్యాక్డ్ ''రంగ్ దే'' ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది.