Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : రంగ రంగ వైభవంగా
By: Tupaki Desk | 2 Sep 2022 9:52 AM GMTచిత్రం : 'రంగ రంగ వైభవంగా'
నటీనటులు: వైష్ణవ్ తేజ్-కేతిక శర్మ-నవీన్ చంద్ర-నరేష్-ప్రభు-సుబ్బరాజు-సత్య-ప్రగతి-తులసి తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: శ్యామ్ దత్ సైనుద్దీన్
నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్
రచన-దర్శకత్వం: గిరీశాయ
తొలి సినిమా 'ఉప్పెన'తో ఘనవిజయాన్నందుకుని.. రెండో సినిమా 'కొండపొలం'తో తన అభిరుచిని చాటుకున్న యువ నటుడు వైష్ణవ్ తేజ్. ఈ మెగా కుర్రాడు ఇప్పుడు 'రంగ రంగ వైభవంగా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కేతిక శర్మ కథానాయికగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో గిరీశయ్య తెలుగులో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. మంచి పాటలు.. ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఏమేర అంచనాలను అందుకుందో చూద్దాం పదండి.
కథ:
రిషి (వైష్ణవ్ తేజ్).. రాధ (కేతిక శర్మ) చిన్నతనం నుంచి స్నేహితులు. పక్కపక్క ఇళ్లలో ఉంటూ పెరిగి పెద్దయిన ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే స్కూల్లో ఉండగా ఒక గొడవతో మాట్లాడుకోవడం మానేస్తారు. కానీ ఒకరంటే ఒకరికి ఇష్టం మాత్రం కొనసాగుతుంది. ఈ గిల్లికజ్జాలతోనే పదేళ్లు గడిపేసిన రిషి-రాధ.. చివరికి ఓ సందర్భంలో పరస్పరం మాట్లాడుకుంటారు. ఒకరి మీద ఒకరికున్న ప్రేమను బయటపెట్టుకుంటారు. ఇలా ఇద్దరూ ఒక్కటయ్యే సమయానికి వారి ఇళ్లలో పెద్ద గొడవ జరుగుతుంది. రెండు కుటుంబాలు విడిపోతాయి. ఈ పరిస్థితుల్లో ఆ రెండు కుటుంబాలను కలిపి రిషి-రాధ ఎలా ఒక్కటయ్యారన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
'రంగ రంగ వైభవంగా'లో హీరో హీరోయిన్ల కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. తమ పెద్దల్ని ఎలా కలపాలో తెలియక ముందుగా తమ తండ్రుల మీద ఫోకస్ చేస్తారు. ఒకరి ఫోన్ నుంచి ఇంకొకరికి వాళ్లకు తెలియకుండా మెసేజ్ చేస్తారు. తీరా చూస్తే హీరో హీరోయిన్లే ఒకరికొకరు మెసేజ్ పెట్టుకున్నారని అర్థమవుతుంది. చేసేది లేక ఆ ఇద్దరూ బోర్ కొడుతోందని ఇంకే సినిమా దొరకనట్లు 'యమగోల' సినిమాకే వెళ్తారు. వీళ్లిద్దరూ సినిమా చూస్తుండగా.. ఓలమ్మీ తిక్క రేగిందా పాట వస్తుంది. వాళ్ల తండ్రులిద్దరూ స్క్రీన్ ముందు చేరి పేపర్లు ఎగరేస్తూ డ్యాన్సులు చేస్తుంటారు. హీరో హీరోయిన్లిద్దరూ ఆ సీన్ చూసుకుని మురిసిపోతారు. ఇదీ ఆ తండ్రులిద్దరూ కలిసిపోయే బృహత్తరమైన సీన్. ఇక తండ్రుల సంగతి అయిపోయింది కదా. తల్లుల విషయానికి వద్దాం. ముందేమో మేడ మీద ఒకరి చీర తీసి ఇంకొకరి మేడ మీద వేసేస్తారు. ఆ చీర తీసి ఇటు ఇచ్చే క్రమంలో ఇద్దరూ మాట్లాడేసుకుంటారని, కలిసిపోతారని అద్భుతమైన ప్లాన్ వేస్తాడు హీరో. కానీ అది వర్కవుట్ కాదు. ఇక లాభం లేదని హీరో ఈసారి 'కార్తీక దీపం' సీరియల్లో డాక్టర్ బాబును రంగంలోకి దించుతాడు. అతణ్ని చూసి ఆ తల్లులిద్దరూ ఎగ్జైట్ అయిపోయి ఒకరితో ఒకరు మాట్లాడేసుకుంటారు. కలిసి ఉంటే కలదు సుఖం అని డాక్టర్ బాబు చిన్న స్పీచ్ ఇవ్వగానే వాళ్లలో రియలైజేషన్ వచ్చేస్తుంది. హీరో హీరోయిన్లు ఫుల్ హ్యాపీ. ఇలాంటి సీన్లు రైటింగ్... ఎడిటింగ్ టేబుళ్లను దాటి తెరమీదికి వచ్చేశాయంటే.. ఇది ఏ స్థాయి సినిమాను అర్థం చేసుకోవచ్చు.
హీరో హీరోయిన్ల తండ్రులు బెస్ట్ ఫ్రెండ్స్. రెండు కుటుంబాల మధ్య గోడలుంటాయి కానీ.. వారి మనసులకు అడ్డుగోడలుండవు. చిన్నప్పట్నుంచి గిల్లికజ్జాలతో సాగే వారి పిల్లలు తర్వాత ప్రేమలో పడతారు... వారి కుటుంబాల్లో ఏవో సమస్యలొస్తాయి. చివరికి ఇద్దరూ ఒక్కటవుతారు. ఈ వరస చూస్తే ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట వచ్చిన నువ్వు లేక నేను లేను.. నువ్వే కావాలి లాంటి సినిమాలు గుర్తుకు రావడం పక్కా. ఐతే ఈ సినిమాలు ఇప్పుడు చూసినా ఫ్రెష్ గా అనిపిస్తాయి. కానీ ఇప్పుడొచ్చిన 'రంగ రంగ వైభవంగా' మాత్రం అడుగడుగునా రొటీన్.. ఔట్ డేటెడ్ అనిపిస్తూ సాగుతుంది. బూతద్దం పెట్టి వెతికినా సినిమా మొత్తంలో ఒక్కటంటే ఒక్క కొత్త సీన్ కనిపించదు. ఆరంభం నుంచి చివరిదాకా పరమ రొటీన్ అనిపిస్తూ.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతూ సాగ సినిమా ఇది. హీరో హీరోయిన్లు చిన్న ఇగో క్లాష్ వల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోరు.. కానీ వారి మధ్య ప్రేమ మాత్రం ఉంటుంది.. ఈ పాయింట్ ట్రైలర్ కట్ చేసుకోవడానికి బాగానే పనికొచ్చింది. కానీ ఈ పాయింట్ మీద సినిమా తీసి మెప్పించాలంటే.. అందమైన రొమాంటిక్ మూమెంట్స్.. గిల్లికజ్జాలతో కూడిన సీన్లు రాసుకోవాలి. కానీ 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ తర్వాత సొంత కథతో తెలుగులో దర్శకుడిగా అరంగేట్రం చేసిన గిరీశాయ.. రైటింగ్ దగ్గరే పూర్తిగా తేలిపోయాడు. ఏమాత్రం ఆసక్తి లేని.. కొత్తగా అనిపించని రొటీన్ సీన్లతో లాగించేశాడు. హీరో హీరోయిన్ల మధ్య ఫిజికల్ రొమాన్స్ సీన్లు చాలానే పెట్టినా సరే.. వారి మధ్య 'రొమాన్స్'ను ఎంతమాత్రం ప్రేక్షకులు ఫీల్ కాలేరంటే.. వారి పాత్రలను అంత పేలవంగా తీర్చిదిద్దారని అర్థం. సినిమా మొత్తంలో ఎక్కడా కూడా వారి మధ్య కెమిస్ట్రీ ఏమాత్రం వర్కవుట్ కాలేదు.
హీరో హీరోయిన్ల మధ్య గిల్లికజ్జాలతో సాగే ఆరంభ సన్నివేశాలతోనే ఇది చాలా రొటీన్ సినిమా అనే ముద్ర పడిపోతుంది. ఇక ఏ దశలోనూ ఎగ్జైట్మెంట్ కలగని విధంగా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. ఇంటర్వెల్ దగ్గర కథలో వచ్చే మలుపు.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ మాత్రమే సినిమాలో కాస్త ప్రేక్షకుల్లో కొంత క్యూరియాసిటీ పెంచుతుంది. హీరో హీరోయిన్ల తమ ఇగోను పక్కన పెట్టి ఒక్కటయ్యే సమయానికి కుటుంబంలో పెద్ద గొడవ జరగడంతో ఈ సమస్యను దాటి తర్వాత ఇద్దరూ ఎలా కలుస్తారా అన్న ఆసక్తి కలుగుతుంది. కానీ ద్వితీయార్ధంలో ఏమాత్రం ఆసక్తి రేకెత్తించని కథనంతో గిరీశాయ సినిమాను తేల్చి పడేశాడు. హీరో హీరోయిన్లు దొంగ చాటుగా కలుస్తూ తమ కుటుంబాలు కలపడానికి చచ్చు ప్లాన్లు వేయడం.. వాటిని అమల్లో పెట్టడం.. ఈ క్రమంలో సాగే కథనం ప్రేక్షకులను నీరసానికి గురి చేస్తుంది. అంతకంతకూ 'రంగ రంగ వైభవంగా' గ్రాఫ్ పడిపోతూ వెళ్తుందే తప్ప ఏ దశలోనూ పైకి లేవదు. ముగింపు కూడా పేలవంగా ఉండడంతో సినిమా మీద ఇంప్రెషన్ మారే అవకాశమే లేకపోయింది.
నటీనటులు:
వైష్ణవ్ తేజ్.. తన తొలి రెండు చిత్రాలతో పోలిస్తే సరదాగా ఉండే పాత్ర చేశాడిందులో. కానీ చాలా మూడీగా కనిపించే అతను ఇలాంటి చలాకీ పాత్రలకు సెట్ కాడేమో అనిపిస్తుంది తన నటన చూస్తే. వైష్ణవ్ బాడీ లాంగ్వేజ్.. నటన ఈ పాత్రకు సెట్ కాలేదు. ఎంత జోష్ చూపించాలని ప్రయత్నించినా ఆ పాత్రలో అది ప్రతిఫలించలేదు. సీరియస్ సీన్లలో మాత్రం అతను ఓకే అనిపించాడు. హీరోయిన్ కేతిక శర్మ చూడ్డానికి బాగుంది. కానీ నటన పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆమె కూడా చాలా వరకు డల్లుగానే కనిపించింది. నవీన్ చంద్ర కథలో కొంచెం కీలకంగా ఉండే పాత్రలో బాగానే చేశాడు కానీ.. తన టాలెంటుకు తగ్గ క్యారెక్టర్ అయితే కాదిది. నరేష్.. ప్రభు ఏదో ఉన్నామంటే ఉన్నాం అనిపించారే తప్ప అవి వాళ్లే చేయాల్సిన పాత్రలు అనిపించలేదు. ప్రగతి.. తులసి.. నాగబాబు.. సుబ్బరాజు వీళ్లంతా మామూలే. ఆలీ.. సత్యల కామెడీ రొటీనే
సాంకేతిక వర్గం:
దేవిశ్రీ ప్రసాద్ తన పాటలతో కొంచెం హుషారు తెప్పించే ప్రయత్నం చేశాడు. కొత్తగా లేదేంటి.. పాట అన్నింట్లోకి హైలైట్. మిగతా పాటలు కూడా పర్వాలేదు. కొత్తగా లేదేంటి థీమ్ మ్యూజిక్ మినహాయిస్తే నేపథ్య సంగీతం సాధారణంగానే అనిపిస్తుంది. అయినా సన్నివేశాల్లో విషయం ఉంటేనే కదా.. నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేయడానికి దేవి అయినా ప్రయత్నిస్తాడు. అతణ్ని ఇన్‌స్పైర్ చేసేంత విషయం సినిమాలో లేకపోయింది. శ్యామ్ దత్ సైనుద్దీన్ ఛాయాగ్రహణం బాగానే సాగింది. విజువల్స్ కలర్ ఫుల్ గా సాగాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ గిరీశాయ ఎంచుకున్న కథలోనే విషయం లేదు. చాలా సినిమాలను కలిపి స్క్రిప్టును కిచిడీలా వండేశాడు తప్పితే.. కొత్తగా అతను చేసిందేమీ లేదు. రైటింగ్ దగ్గరే 'రంగ రంగ వైభవంగా' తేలిపోయింది. ఇక టేకింగ్ లోనూ ఏ మెరుపులూ లేకపోవడంతో సినిమా చాలా సాధారణంగా తయారైంది. తొలి సన్నివేశం దగ్గర్నుంచి రొటీన్ అనిపించే సినిమా ఏ దశలోనూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేయదు.
చివరగా: రంగ రంగ వైభవంగా.. చప్ప చప్పగా
రేటింగ్ - 2/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre