Begin typing your search above and press return to search.

వీడియో : 'రంగరంగ వైభవంగా' సిరిసిరి మువ్వలోన మెలోడీ

By:  Tupaki Desk   |   30 Aug 2022 1:30 PM GMT
వీడియో : రంగరంగ వైభవంగా సిరిసిరి మువ్వలోన మెలోడీ
X
మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌.. కేతిక శర్మ జంటగా నటించిన రంగరంగ వైభవంగా సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదల అయిన టీజర్‌ మరియు ట్రైలర్ లు సినిమా పై ఆసక్తి ని పెంచాయి. తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ పాట విజువల్ గా కన్నుల విందు చేసే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించిన ఈ పాట మెలోడీ ట్యూన్ తో ఆకట్టుకుంది. అంతే కాకుండా లిరిక్స్‌ మరియు విజువల్స్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

వైష్ణవ్‌ తేజ్ మరియు కేతిక శర్మల జోడీకి ఇప్పటికే మంచి మార్కులు పడుతున్నాయి. అందమైన ఈ జంట ను చాలా పద్దతిగా మరింత అందంగా దర్శకుడు చూపించాడంటూ కూడా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రంగ రంగ వైభవంగా సినిమా కు అర్జున్‌ రెడ్డి సహాయ దర్శకుడు గిరిశాయ దర్శకత్వం వహించాడు. ఈయన తమిళ అర్జున్‌ రెడ్డి కి దర్శకత్వం వహించాడు. అక్కడ అర్జున్ రెడ్డి స్థాయిలో కాకున్నా మంచి విజయాన్ని ఆదిత్య వర్మ అందుకుంది. అందుకే ఇప్పుడు తెలుగు లో వెంటనే దర్శకత్వం చేసే అవకాశం ను దక్కించుకున్నాడు.

ఫ్యామిలీ కమ్‌ యూత్ ఫుల్‌ స్టోరీ తో ఈ సినిమా ను ఒక పండుగ వాతావరణం కనిపించేలా రూపొందించాము అంటూ దర్శకుడు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. కథ ఎలా ఉంటుందో కానీ సినిమా యొక్క ట్రైలర్‌ మరియు టీజర్ పోస్టర్ లు ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైన్‌నర్ గా సినిమా ఉంటుందేమో అనిపిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.