Begin typing your search above and press return to search.
సీఎం జగన్ పోలికలే ఛాన్సిచ్చాయా?
By: Tupaki Desk | 30 Oct 2019 8:14 AM GMT`కమ్మరాజ్యంలో కడపరెడ్లు` ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి వర్మ సంచలనం సృష్టించాడు. అదురు బెదురు.. అన్నదే లేకుండా స్ట్రెయిట్ గా అన్ని పాత్రలను రివీల్ చేసాడు. అధికార, ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నా వాటిని బేఖతరు చేసి తానేం చేయాలో అది చేశాడు. ఇలాంటివి నాకేం కొత్త కాదు.. మీకు కొత్తగా అనిపిస్తుంది అందుకే మీడియా ముందుకెళ్లి రచ్చ చేస్తున్నారంటూ మరింత రెచ్చగొట్టాడు. ఎంత రెచ్చిపోతే అంత ఉచిత పబ్లిసిటీ అని! చెప్పకనే చెప్పాడు.
ఆ విషయం పక్కనబెడితే ఇందులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రలో `రంగం` ఫేం అజ్మల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ కు అచ్చు గుద్దినట్లే ఉంటాడు. జగన్ సిఎం కాక ముందు నుంచి జగన్ కి డూప్ గా బాగా పాపులర్ అయ్యాడు. అజ్మల్ ఆహార్యం.. బాడీ లాంగ్వేజ్ అన్ని జగన్ కు చాలా దగ్గరగా ఉంటాయి. అజ్మల్ కి టాలీవుడ్ లో ఓ నటుడిగా కన్నా జగన్ పోలికలు కలిగి ఉండటమే ఎక్కువ గుర్తింపును తెచ్చి పెట్టింది. ఇప్పుడా ఐడెంటిటీని కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో.. అది కూడా వర్మతో కలిసి పనిచేసే అవకాశం తెచ్చి పెట్టింది. ఇంత వరకూ బాగానే ఉంది.
మరి జగన్ పాత్రలో నటించడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే? కేవలం జగన్ వీడియోలను చూస్తూ ఆయనలా ఉండటానికి ట్రై చేసానని అజ్మల్ చెప్పాడు. జగన్ ని వ్యక్తిగతంగా కలిసే అవకాశం తనకు రాలేదని.. వర్మ కూడా అలాంటి ఆలోచన చేయలేదని అన్నాడు. సీఎం గారి గత వీడియోల ద్వారా.. వర్మ ఇచ్చిన ఇన్ పుట్స్ ద్వారా జగన్ పాత్రలో ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేసానని అజ్మల్ తెలిపాడు.