Begin typing your search above and press return to search.

అతడ్ని మారుస్తానని.. తాను సూసైడ్ చేసుకున్నాడే

By:  Tupaki Desk   |   20 Dec 2015 5:50 AM GMT
అతడ్ని మారుస్తానని.. తాను సూసైడ్ చేసుకున్నాడే
X
సీనియర్ నటుడు రంగనాథ్ సూసైడ్ అందరికి షాక్ నిస్తోంది. ఆయన ఆత్మహత్యకు కారణం ఇతిమిద్ధంగా తేలనప్పటికి.. వ్యక్తిగత కారణాలే కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. రంగనాథ్ గురించి బాగా తెలిసిన వారు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆయన జీవితానికి.. ఆత్మహత్యకు దగ్గర సంబంధం ఉందని చెబతారు.

యూత్ లో ఉన్నప్పుడు ఏమీ తోచక ఒకసారి రైలు పట్టాల మీద సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారట. అలానే పట్టాల మీదకు వెళ్లి.. ట్రైన్ కోసం ఎదురుచూస్తే.. రైలు రావటం ఆలస్యం కావటం.. యాక్టింగ్ చేయాలన్న ఆలోచనతో సూసైడ్ అంటెప్ట్ ను వదిలేసి వచ్చేశారు. తర్వాత ఆయన ఎంతలా రాణించింది తెలిసిందే.

ఆ తర్వాత ఎప్పడూ ఆయన సూసైడ్ గురించి ఆలోచించింది లేదు. ఈ మధ్యన యువ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా స్పందించిన ఆయన.. ఉదయ్ కిరణ్ కానీ తన దగ్గరకు వచ్చి ఉంటే.. అతని మనసు మార్చేసేవాడినన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతటి ధైర్యవచనాలు పలికిన ఆయన.. చివరకు ఆత్మహత్య చేసుకోవటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యను గట్టిగా వ్యతిరేకించే రంగనాథ్ చివరకు దానినే ఆశ్రయించటం విషాదకరం.