Begin typing your search above and press return to search.
రంగస్థలం.. ఇంకో 15.30 గంటల నిరీక్షణ
By: Tupaki Desk | 7 Dec 2017 5:46 PM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన బాబాయి పవన్ కళ్యాణ్ బాటలో సాగుతున్నట్లున్నాడు. పవన్ కొత్త సినిమా ‘అజ్నాతవాసి’ ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా డిలే జరిగి అభిమానులు తీవ్ర అసహనానికి గురైన సంగతి తెలిసిందే. ఐతే ఆ ఫస్ట్ లుక్ చెప్పిన సమయం కంటే రెండు గంటలు మాత్రమే ఆలస్యం కాగా.. చరణ్ సినిమా ‘రంగస్థలం’ ఫస్ట్ లుక్ అనుకున్న సమయం కంటే 15.30 గంటలు ఆలస్యంగా రాబోతోంది.
‘రంగస్థలం’ ఫస్ట్ లుక్ ను ఈ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు లాంచ్ చేస్తామని చిత్ర బృందం నిన్నే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ టైమింగ్ మారిందని.. అభిమానులు మరికొంత సమయం నిరీక్షించాల్సిందే అని ఈ రోజు కొత్తగా ప్రకటన ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం శనివారం ఉదయం 9 గంటలకు ‘రంగస్థలం’ ఫస్ట్ లుక్ పరిచయం చేస్తారట. సాంకేతిక కారణాల వల్లే ఈ డిలే అంటున్నారు.
ఐతే ఈ నిరీక్షణకు సరైన ఫలితమే ఉంటుందని.. ‘రంగస్థలం’ ఫస్ట్ లుక్ అంత స్పెషల్ అని చిత్ర బృందం చెబుతోంది. ఈ లుక్ లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి అంత స్పెషల్ ఈ లుక్ లో ఏముంటుందో.. సుకుమార్ తన ప్రత్యేకతను ఎలా చాటుకుంటాడో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 80వ దశకం నేపథ్యంలో సాగుతుంది. సమంత.. ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.