Begin typing your search above and press return to search.
ఎనిమిదో రోజూ చిట్టిబాబు తగ్గట్లేదు
By: Tupaki Desk | 7 April 2018 10:30 AM GMTవారం రోజులు దాటేసినా చిట్టిబాబు స్పీడ్ కు బ్రేకులు పడటం లేదు. రంగస్థలం రచ్చ ఆగడానికి ఇంకొన్ని రోజులు పట్టేలా ఉంది. ఫస్ట్ వీక్ పూర్తయ్యాక కూడా చాలా చోట్ల హౌస్ ఫుల్స్ కావడం చూస్తుంటే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎండలు కూడా లెక్కచేయరని అర్థమైపోయింది. నిన్నటితో ఎనిమిది రోజులు పూర్తి చేసుకున్న రంగస్థలం ఇప్పటి దాక 135 కోట్ల గ్రాస్ తో 83 కోట్ల దాకా షేర్ రాబట్టి టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ టాప్ 5 లిస్టు లో చేరిపోయింది. ఇప్పటిదాకా ఈ సిరీస్ లో బాహుబలి 2 - బాహుబలి - ఖైది నెంబర్ 150 - శ్రీమంతుడు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వీటి తర్వాత ప్లేస్ రంగస్థలందే. ఇంకా ఫుల్ రన్ పూర్తవ్వడానికి టైం ఉంది కాబట్టి వీటిలో పైకి ఎగబాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిన్నటితో రెండో వారంలోకి అడుగుపెట్టిన రంగస్థలం ఈ శుక్రవారం కూడా 2 కోట్ల 35 లక్షల షేర్ తో 4 కోట్ల 50 లక్షల గ్రాస్ తో తానెంత బలంగా ఉందో చెప్పకనే చెప్పింది.
మొత్తంగా ఎనిమిది రోజుల లెక్కలు చూసుకుంటే రంగస్థలం ఇప్పటి దాకా 95 కోట్ల గ్రాస్ తో 60 కోట్ల షేర్ ఇప్పటి దాకా తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల షేర్ దాటిన సినిమాలు ఇప్పటి దాకా ఆరు మాత్రమే ఉన్నాయి. పైన చెప్పిన నాలుగు కాకుండా మగధీర-జనతా గ్యారేజ్ మాత్రమే ఈ ఫీట్ సాధించాయి. రామ్ చరణ్ కు మగధీర తర్వాత 60 కోట్ల షేర్ దాటిన సినిమా రంగస్థలమే. చాలా అరుదైన రికార్డులకు వేదికగా మారుతున్న రంగస్థలం వసూళ్లు మెగా ఫాన్స్ నే కాదు ట్రేడ్ ను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. కమర్షియల్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం చూసి చాలా కాలమే అయ్యింది. ఎనిమిదవ రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి దాకా వచ్చిన రంగస్థలం షేర్ వివరాలు ఒకసారి లుక్ వేద్దాం
నైజాం – 17 కోట్ల 20 లక్షలు
సీడెడ్ – 11 కోట్ల 85 లక్షలు
నెల్లూరు – 2 కోట్ల 19 లక్షలు
గుంటూర్ – 6 కోట్ల 21 లక్షలు
కృష్ణా – 4 కోట్ల 87 లక్షలు
వెస్ట్ – 4 కోట్ల 17 లక్షలు
ఈస్ట్ – 5 కోట్ల 45 లక్షలు
ఉత్తరాంధ్ర – 8 కోట్ల 45 లక్షలు
తెలుగు రాష్ట్రాలు టోటల్ షేర్ - 60 కోట్లు 40 లక్షలు
మొత్తం 8 రోజులకు గాను తెలుగు రాష్ట్రాల షేర్ 60 కోట్ల దాకా 40 లక్షల దాకా ఉంటుందని ట్రేడ్ అంచనా. వీక్ ఎండ్ కాబట్టి ఈ రోజు రేపు కలెక్షన్ల ఉధృతి బాగానే ఉంటుంది. సోమవారం ఉదయానికి పది రోజుల రన్ పూర్తయిపోతుంది కాబట్టి షేర్ పరంగా ఇంకెన్ని రికార్డ్స్ వస్తాయనేది క్లారిటీ వస్తుంది