Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ రిపోర్ట్: రంగస్థలంతో మోహనరంగ
By: Tupaki Desk | 9 April 2018 10:31 AM GMTథియేటర్ల సమ్మె టైంలో కళ తప్పిన బాక్స్ ఆఫీస్ పూర్తిగా పుంజుకుంది. రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు చల్ మోహనరంగా కూడా టార్గెట్ ఆడియన్స్ ని మెప్పిస్తూ మంచి వసూళ్లు రాబట్టడం పట్ల ట్రేడ్ హ్యాపీగా ఉంది. దానికి తోడు వేసవి సెలవులు కావడంతో వీక్ డేస్ లో సైతం థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఎన్ఆర్ఐలకు తమ గ్రామాల్లోని మట్టి వాసనల్ని పట్టి చూపించిన సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అక్కడ కనక వర్షమే కురిసింది. అంచనాలకు భిన్నంగా అనూహ్యంగా పది రోజుల లోపే 3 మిలియన్ మార్క్ చేరుకోవడంతో చిట్టిబాబు ద్వారా కొత్త ట్రెండ్ సెట్ చేసాడు రామ్ చరణ్ తేజ్.
ఇక చల్ మోహనరంగా రన్ కూడా డీసెంట్ గా ఉంది. రంగస్థలం మేనియా ఉధృతంగా ఉన్న టైంలో రావడం వల్ల కొంత ప్రభావం పడుతోంది కాని ఇలా కాకుండా సోలోగా కాస్త టైం తీసుకుని వచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేదని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయినా కూడా ఓవర్సీస్ లో నితిన్ తగ్గడం లేదు. మిలియన్ మార్క్ కు దగ్గరగా రంగాను తీసుకెళ్తున్నాడు. ఇక వీక్ ఎండ్ వసూళ్లను గమనిస్తే ట్రెండ్ ఏంటో అర్థమవుతుంది.
రంగస్థలం రెండో వారాంతం
శుక్రవారం : $122,282
శనివారం : $202,169
ఆదివారం : $100,000
మొత్తం : $3,172, 130
చల్ మోహనరంగ మొదటి వారాంతం
బుధవారం : $139,845
గురువారం : $70521
శుక్రవారం : $78421
శనివారం: $89025
ఆదివారం: $41000
మొత్తం : $422,000
అఆ తర్వాత నితిన్ మిలియన్ మార్క్ సాధించిన మూవీ చల్ మోహనరంగనే అవుతుంది. డీసెంట్ గా ఉన్న కామెడీ-మ్యూజిక్- నితిన్ మేఘా జంట ఇవన్ని ఓవర్సీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. నాని కృష్ణార్జున యుద్ధం వచ్చాక కొంచెం లెక్కల్లో మార్పు రావొచ్చు కాని అప్పటి దాకా రెండు సినిమాలు చాలా స్ట్రాంగ్ గానే రన్ కంటిన్యూ చేయబోతున్నాయి.