Begin typing your search above and press return to search.

ఈ సినిమాలను ఇంకా చూస్తూనే ఉన్నారు

By:  Tupaki Desk   |   23 Jun 2018 4:29 AM GMT
ఈ సినిమాలను ఇంకా చూస్తూనే ఉన్నారు
X
ఈ స్పీడ్ యుగంలో సినిమా జాతకం మొదటి రోజే తెలిసిపోతోంది. హిట్ సినిమా అంటే మొదటి రెండు వారాల వరకు థియేటర్లలో ప్రేక్షకుల సందడి కనిపిస్తోంది. ఆ తరవాత చాలావరకు థియేటర్లలో సినిమా ఎత్తేయక తప్పని పరిస్థితి. అలాంటిది యాభై రోజులపాటు సినిమాకు జనాలు కంటిన్యూగా రావడమంటే సామాన్యమైన విషయం కాదు.

రామ్ చరణ్ - సమంత జంటగా నటించిన రంగస్థలం మూవీ ఈ అరుదైన రికార్డ్ సాధించింది. ఇప్పటికే అర్ధశత దినోత్సవం పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇంకా కొన్ని థియేటర్లలో ఆడుతూనే ఉంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ థియేటర్లలో జూన్ 22వ తేదీ ఫస్ట్ షోకు రంగస్థలం మూవీకి దాదాపు రూ. 10 వేల కలెక్షన్ రావడం విశేషం. రీసెంట్ హిట్ మూవీ అభిమన్యుడుకు సప్తగిరి హాల్ లో రూ. 10,641 కలెక్షన్ వసూలైంది. శాంతి థియేటర్ లో మహానటి మూవీ రూ. 8,189 వసూలు చేయగలిగింది.

రంగస్థలం మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో వచ్చేసింది. అంటే ఇంట్లోనే మొబైల్ లోనో.. కంప్యూటర్ లోనూ చూసే ఫెసిలిటీ ఉంది. కానీ ఇప్పటికీ కోరి థియేటర్ కు వచ్చి చూసేవారున్నారంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించిందో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు మహానటి సినిమా కూడా వీకెండ్ ముందు మంచి కలెక్షన్లు రాబట్టింది.