Begin typing your search above and press return to search.
రంగస్థలంతో అన్ని లాభాలే!!
By: Tupaki Desk | 7 May 2018 6:44 AM GMTటాలీవుడ్ లో గత కొంత కాలంగా మార్కెట్ పెరుగుతూ వస్తోంది. ఎక్కడ ఎంత వసూలు చేస్తోంది అనే లెక్కలను దృష్టిలో ఉంచుకొని సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా బిజినెస్ పెరిగిన కొద్దీ ఆ తరువాత సినిమాల ఖరీదు చాలా ఎక్కువవుతోంది. కొన్ని ఏరియాల్లో సినిమా కాంబినేషన్ బట్టి అమ్ముడుపోతోంది. పెద్ద సినిమాలు ఏ మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా భారీ నష్టాలను చూడాల్సి వస్తోంది.
ఇకపోతే ఈ ఏడాది రంగస్థలం సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటు నిర్మాతలకు అటు బయ్యర్లకు మంచి లాభాలను అందించింది. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రంగస్థలం 120 కోట్ల వరకు షేర్స్ అందించింది. రామ్ చరణ్ కెరీర్ లోనే ఈ సినిమా ది బెస్ట్ సినిమాగా నిలిచిందనే చెప్పాలి. నైజాం ఏరియాలో 18 కోట్లకు అమ్మడుపోగా 34 రోజుల్లో 27 కోట్లను రాబట్టింది. సీడెడ్ లో 12 కోట్లకు అమ్ముడుపోగా 34 రోజుల్లో 17 కోట్లను అందుకుంది.
మిగతా ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్స్ కి ఒక రూపాయి లాభమే వచ్చింది కానీ ఎక్కడా కూడా నష్టపోయినట్లు కనిపించడం లేదు. ఉత్తరాంధ్రలో లో 8 కోట్లకు సేల్ అయిన సినిమా 12.08 కోట్ల షేర్స్ ను దక్కించుకుంది. నెల్లూరు గుంటూరు ఈస్ట్ వెస్ట్ కృష్ణా బయ్యర్లకు కూడా కోటికి పైగానే షేర్స్ అందడంతో సంతోషించారు. ఇక ఓవర్సీస్ లో అయితే రంగస్థలం రికార్డ్ షేర్స్ అందుకుంది. 9 కోట్లకు అమ్ముడుపోయిన సినిమా 16.5 కోట్ల షేర్స్ అందించి ఈ మధ్య కాలంలో అందరికి మంచి లాభాలను అందించిన చిత్రంగా రంగస్థలం నిలిచింది.