Begin typing your search above and press return to search.
వారంలోనే 80 దాటేసిన రాంచరణ్
By: Tupaki Desk | 6 April 2018 9:29 AM GMT మార్చ్ 20న విడుదల అయిన రంగస్థలం మూవీ సెన్సేషనల్ రన్ కంటిన్యూ అవుతోంది. తొలి రోజు తొలి ఆట నుంచి అందరినోటా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను సవరిస్తోంది. తొలి వారం రోజుల వసూళ్లకే అనేక బడా ఇండస్ట్రీ హిట్ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ దాటిపోయిందంటే.. రంగస్థలం రన్ ఏ స్టేజ్ లో ఉందో అర్ధమవుతుంది.
తొలి వారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా మెగాపవర్ స్టార్ మూవీ 80 కోట్లకు మించి షేర్ వసూళ్లను దాటింది. బాహుబలి మినహాయిస్తే.. గతంలో వారం వసూళ్ల రికార్డు ఖైదీ నంబర్ 150పేరిట 77 కోట్లతో ఉండేది. ఇప్పుడు తండ్రి రికార్డును.. కొడుకు చరణ్ 3 కోట్ల మార్జిన్ తో దాటేశాడు. అలాగే తెలుగు రాష్ట్రాల షేర్ వసూళ్ల విషయంలో కూడా రంగస్థలంకే రికార్డు దక్కింది. కేవలం తెలుగు స్టేట్స్ నుంచే తొలివారంలో 58 కోట్ల షేర్ ను వసూలు చేసింది రంగస్థలం.
రంగస్థలం తొలి వారం షేర్
నైజాం- రూ. 16.45 కోట్లు
సీడెడ్- రూ. 11.5 కోట్లు
నెల్లూరు - రూ. 2.08 కోట్లు
గుంటూరు రూ. 6.07 కోట్లు
కృష్ణా - రూ. 4.67 కోట్లు
వెస్ట్ 4 కోట్లు
ఈస్ట్ - రూ. 5.25 కోట్లు
ఉత్తరాంధ్ర రూ. 8.02 కోట్లు
ఏపీ +తెలంగాణ తొలి వారం షేర్ - 58.05 కోట్లు
కర్నాటక - రూ. 6.25 కోట్లు
తమిళ నాడు -90 లక్షలు
రెస్టాఫ్ ఇండియా- 75 లక్షలు
యూఎస్ఏ - రూ. 10.70 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్- రూ. 3.50 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా తొలి వారం షేర్- 80.15 కోట్లు
మొదటివారం ముగిసేసరికి.. అత్తారింటికి దారేది.. జైలవకుశ లైఫ్ టైం వసూళ్లను దాటేసిన రంగస్థలం.. ఈ వారంలో జనతా గ్యారేజ్.. శ్రీమంతుడు రికార్డులను కూడా బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఫుల్ రన్ లో నాన్ బాహుబలి రికార్డులు అన్నీ రంగస్థలం పేరిట నమోదు కావడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇప్పటికీ రంగస్థలంకు క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం.. రెండో వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మీద ఉండడం చూస్తుంటే.. చెర్రీ పరుగులు ఎంతవరకూ సాగనున్నాయో చూడాలి.