Begin typing your search above and press return to search.

ఈ సారి రంగస్థలం గణపతి ట్రెండ్!

By:  Tupaki Desk   |   21 Sep 2018 1:29 PM GMT
ఈ సారి రంగస్థలం గణపతి ట్రెండ్!
X
పాతొక రోత కొత్తొక వింత.. ఇదొక పాపులర్ పాత తెలుగు సామెత. ఇంత సీరియస్ గా 'పాత'.. 'కొత్త' ల గురించి సామెత చెప్పింది మనోళ్ళ గురించే కదా. అయినా ఇప్పటి జనరేషన్ లో కూడా మన జనాలకు ఈ సామెత కరెక్ట్ గా సరిపోతుంది. ఎక్కడిదాకానో ఎందుకు... ఈమధ్యే కదా వినాయక చవితి పండగ జరుపుకున్నాం. ఇక నిమజ్జనాలు మూడు.. ఐదు.. ఏడు.. తొమ్మిది.. పదకొండు అని బేసి రోజుల్లో జరుపుతారు. అంతలోపు అన్ని గణేష్ మండపాల దగ్గర జనాలు సమయం గడపాలి కదా. మరి గణేష్ విగ్రహం రెగ్యులర్ గా ఉన్నట్టే ఉంటే కొత్తదనం ఏం ఉంటుంది?

అందుకే చాలామంది గణేశుడికి గెటప్పులు మారుస్తారు. గజ ముఖం.. ఏక దంతం.. ఇవన్నీ టచ్ చేయకుండా మిగతా గెటప్ లో కొత్తదనం చూపిస్తారు. ఇక ఆ గెటప్స్ లో హిట్ సినిమాల ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పటివరకూ మనం 'గబ్బర్ సింగ్' లో పవన్ కళ్యాణ్ గెటప్ లో గణేశుడు.. 'బాహుబలి' గణేశుడిని చూసి ఉంటాం. తాజాగా రంగస్థలం చిట్టిబాబు గెటప్ లో గణేశుడిని ఈ ఏడాది కొన్ని మండపాలలో పెట్టి భక్తితో ప్రార్థనలు చేస్తున్నారు. సో.. పోయినేడాది 'బాహుబలి' అయితే ఈ ఏడాది 'రంగస్థలం' చిట్టిబాబు గెటప్ కొత్తదనం అన్నమాట.

భక్తితో తమ దేవుడిని డిఫరెంట్ గా చూడాలనుకోవడం లో ఉద్దేశాన్ని మనం తప్పు పట్టలేం కానీ ఇలా దేవుడి గెటప్ మార్చడం సరికాదని అయన ట్రెడిషనల్ గా ఎలా ఉంటాడో అలా ఉంటే బాగుంటుందని కొంతమంది భక్తుల ఉద్దేశం. మరి ఈ విషయాన్ని కొత్తదనం గట్టిగా కోరుకునే భక్తులు పట్టించుకుంటారా అనేది అనుమానమే.