Begin typing your search above and press return to search.
'పుష్ప' డైరెక్టర్ రంగస్థలం అంటూ ఆడిస్తారా?
By: Tupaki Desk | 21 Jan 2022 11:35 AM GMTబాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత కేజీఎఫ్ .. ఆ తర్వాత పుష్ప బాలీవుడ్ మార్కెట్లో సత్తా చాటి ఆ సినిమాల్లో నటించిన హీరోల గ్రాఫ్ ని ఉత్తరాదిన అమాంతం పెంచాయి. హిందీ బెల్ట్ లో 100 కోట్ల క్లబ్ అంతకుమించిన వసూళ్లతో సత్తా చాటగల హీరోలుగా ప్రభాస్ .. యష్ నిరూపించారు. ఆ తర్వాత పుష్పరాజ్ పాత్రలో సత్తా చాటిన బన్ని కరోనా క్రైసిస్ కొనసాగుతున్నా.. ఓటీటీలో విడుదలైపోయినా ఇప్పటివరకూ పుష్ప వసూళ్ల హవా సాగింది. అంతగా బన్ని తనదైన నటనతో వర్కవుట్ చేసాడు. దాదాపు 75కోట్లు పైగా పుష్ప - ది రైజ్ వసూలు చేసింది.
ఈ సినిమాతో బన్ని పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలిగాడు. ఇకపోతే ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో పాన్ ఇండియా లీగ్ లో సత్తా చాటాలని ఆశించిన చరణ్ - ఎన్టీఆర్ ఆశలు అడియాసలయ్యాయి. ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడడం ఆ ఇద్దరికీ నిరాశను మిగిల్చింది. అయితే ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడు రిలీజైనా సత్తా చాటుతామనే ధీమా చరణ్.. తారక్ లో ఉంది. హిందీలోనూ పెద్ద స్టార్లుగా తమను తాము ప్రూవ్ చేయాలన్న సంకల్పం ఆ ఇద్దరిలో ఉంది.
ఇంతలోనే రామ్ చరణ్ కి మగధీరతో వచ్చిన గుర్తింపు ఇప్పుడు ఇతర సినిమాలతో వస్తే ప్లస్ కానుందని అంచనా. మరోవైపు చరణ్ నటించిన రంగస్థలం హిందీ వెర్షన్ ని ఈ పాండమిక్ లోనే విడుదల చేసేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. బహుశా పుష్ప డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమాగానూ హిందీ వెర్షన్ కి ప్రమోషన్ పరంగాను కలిసొస్తుందనడంలో సందేహమేం లేదు. ఫిబ్రవరిలో రంగస్థలం-హిందీ వెర్షన్ విడుదల కానుంది. ప్రస్తుతం థియేటర్లు డ్రైగా ఉండడంతో థియేటర్ల రంగానికి ఈ సినిమా ఊపు తెస్తుందని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారట. పుష్ప తరహా రగ్డ్ డ్ హీరోయిజం ఉన్న రంగస్థలంతో హిట్టు కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారట.