Begin typing your search above and press return to search.
మెగా పవర్ స్టామినా చూపించాడు
By: Tupaki Desk | 5 May 2018 6:25 AM GMTమొత్తానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అసలైన సత్తాను రంగస్థలం సినిమాతో చూపించడానే చెప్పాలి. గత కొంత కాలంగా కమర్షియల్ హిట్స్ ఎన్ని వస్తున్నప్పటికీ స్టార్ హీరోగా రికార్డులు క్రాస్ చేయాల్సిన పనిని మర్చిపోయాడని అంతా అనుకున్నారు. కానీ సుకుమార్ దర్శకత్వంలో చేసిన రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ 100 కోట్ల బాక్స్ ఆఫీస్ ను క్రాస్ చేసి మెగా పవర్ ని చూపంచాడు. ఓ వైపు నిర్మాతలు మరో వైపు బయ్యర్లు లాభాలు అందుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నారు.
ముఖ్యంగా ఓవర్సీస్ లో కూడా రామ్ చరణ్ తన స్టార్ స్టామినను చూపించాడు. బాహుబలి తరువాత యూఎస్ లో అత్యధిక డాలర్ల వర్షం కురిపించిన చిత్రంగా రంగస్థలం నిలిచింది. సుకుమార్ సినిమాలకు ముందు నుంచి ఓవర్సీస్ లో మంచి రికార్డ్ ఉంది. దానికి తోడు రామ్ చరణ్ డిఫరెంట్ గా కనిపించడం.. కథ కూడా వినూత్నంగా ఉండడంతో ప్రవాసులు చాలానే ఇష్టపడ్డారు. దాదాపు 3.5 మిలియన్ల వరకు అందుకొని బాహుబలి 1 మరియు 2 సినిమాల తరువాత అత్యదిక వసూళ్లు అందుకున్న తెలుగు చిత్రంగా నిలిచింది.
దర్శకుడు సుకుమార్ కి కూడా ఇది మంచి పరిణామం అని చెప్పాలి. ఆయన డైరెక్ట్ చేసిన గత సినిమాలు ఎప్పుడు ఈ రేంజ్ లో హిట్ అవ్వలేదు. సినిమా విడుదలకు ముందు ప్రీమియర్స్ తోనే సినిమా మంచి కలెక్షన్స్ అందుకుంది. పాజిటివ్ టాక్ రావడంతో ఈజీగా 2 మిలియన్స్ ని క్రాస్ చేసి మొత్తానికి 3.5 మిలియన్ల డాలర్లను కూడా రాబట్టింది. ఇక అవేంజర్స్ - భరత్ అనే నేను సినిమాలు రావడంతో రంగస్థలం కలెక్షన్స్ కొద్దిగా తగ్గాయని చెప్పాలి.