Begin typing your search above and press return to search.
పోస్టర్ టాక్: 200 కోట్ల రంగస్థలం
By: Tupaki Desk | 1 May 2018 4:21 AM GMTరామ్ చరణ్ మూవీ రంగస్థలం.. ఈ ఏడాది తొలి బ్లాక్ బస్టర్ అనడంలో సందేహం లేదు. ఏ యాంగిల్ నుంచి.. ఏ తరహా ప్రేక్షకుల నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కోకుండా.. ప్రతీ ఏరియాలోని బయ్యర్ కు భారీ లాభాలను అందించి.. జెన్యూన్ బ్లాక్ బస్టర్ అంటూ అందరితోనే ప్రశంసలు అందుకుంది రంగస్థలం. ఐదు వారాలు గడిచినా.. ఇంకా వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ పడుతున్నాయంటే సినిమా రేంజ్ అర్ధమవుతుంది.
ఇప్పుడీ చిత్రానికి మే 1తేదీన.. మేడే సందర్భంగా స్పెషల్ పోస్టర్ వేశారు. ఇందులో 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రంగస్థలం అధిగమించిన విషయాన్ని యూనిట్ కన్ఫాం చేసింది. తెలుగు సినీ చరిత్రలో ఇప్పటివరకూ బాహుబలి సిరీస్ మినహా.. మరే చిత్రం కూడా 200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన రికార్డును చేరలేదు. తొలిసారిగా ఆ క్లబ్ లోకి చేరుకుని తన సత్తా చాటాడు చెర్రీ. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో.. రంగస్థలం వసూళ్ల హంగామా మరికొన్ని వారాల పాటు కంటిన్యూ కావచ్చనే అంచనాలు ఉన్నాయి.
మరోవైపు తొలివారం చివరకే 161 కోట్ల గ్రాస్ ను భరత్ అనే నేను చిత్రం కలెక్ట్ చేసిందంటూ ఆ చిత్ర నిర్మాత పోస్టర్ వేశారు. దీనిపై ట్రేడ్ జనాలు జోకులు వేయగా.. ఆడియన్స్ నుంచి ట్రాలింగ్ ఎదురైంది. అయితే.. తాము చెప్పినవన్నీ నిజమే అని నిరూపించేందుకా అన్నట్లుగా.. బయ్యర్లతో లెక్కలు చెప్పించారు దానయ్య. ఆ సంగతలా ఉన్నా.. ఫుల్ రన్ లో మహేష్ మూవీ భరత్ అనే నేను కూడా 200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసే ఛాన్సులున్నాయి.