Begin typing your search above and press return to search.
యుఎస్ డిస్ట్రిబ్యూటర్ వల్ల రంగస్థలంకి గట్టి ఎదురుదెబ్బ!
By: Tupaki Desk | 26 March 2018 3:28 PM GMTస్టార్ హీరో సినిమాలకు ఓవర్సీస్ ఓపెనింగ్స్ కీలకంగా మారుతున్న తరుణంలో అక్కడి మార్కెట్ మీద మన నిర్మాతలు ప్రత్యేక దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సుకుమార్ సినిమాలకు అక్కడ బేస్ బాగుంది. నాన్నకు ప్రేమతో ఇక్కడ మాస్ కి పూర్తిగా కనెక్ట్ కాకపోయినా అమెరికాలో మాత్రం మిలియన్ డాలర్ క్లబ్ లో త్వరగా చేరిపోవడం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక్కడ డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్న 1 నేనొక్కడినే మూవీ అక్కడి ప్రేక్షకులు ఆదరించారు. ఇంటలిజెన్స్ ని తన స్క్రిప్ట్ లో జోడించే సుకుమార్ టేకింగ్ మీద అక్కడ మంచి అభిప్రాయమే ఉంది. కాని విచిత్రంగా యుఎస్ లో సుకుమార్ దర్శకత్వంలో మెగా హీరో సినిమా రంగస్థలం వస్తోంది అన్న హడావిడే కనిపించడం లేదు. కారణం అక్కడి డిస్ట్రిబ్యూటర్ ప్లానింగ్ లోపమే అని సమాచారం. విడుదల తేదిని చాలా రోజల క్రితమే కన్ఫర్మ్ చేసినా దానికి తగట్టు స్క్రీన్స్ ని సెట్ చేసుకోవడం కాని థియేటర్ లను బుక్ చేసుకోవడం లాంటి చర్యలేవి పక్కాగా తీసుకోకపోవడంతో సరైన లోకేషన్స్ కూడా దొరకలేదని వస్తున్న వార్త మెగా ఫాన్స్ ని కలవరపెడుతోంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న మూవీ కాబట్టి ప్రవాస భారతీయులు దీనికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారేమో అన్న పాజిటివ్ పాయింట్ ని పక్కన పెట్టేసి అక్కడి డిస్ట్రిబ్యూటర్ తన మానాన తాను ప్రణాళిక లేకుండా విడుదల చేసుకోవడం ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టేలా ఉంది. దానికి తోడు అక్కడ రంగస్థలం డిస్త్రిబ్యూట్ చేస్తున్న సంస్థ ఈ రంగానికి కొత్త కావడం వల్ల ఆ అనుభవ రాహిత్యం బిజినెస్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దాని వల్లే యుఎస్ ఆన్ లైన్ బుకింగ్ లో ఉంచిన మొదటి రోజు టికెట్లు ఇప్పటి దాకా పూర్తిగా సేల్ కాకపోవడమే దీనికి నిదర్శనం. ఏడాది క్రితం వచ్చిన ఖైది నెంబర్ 150 పక్కా మాస్ సినిమా అయినప్పటికీ అక్కడి ఫాన్స్ చేసిన హడావిడి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కూడా అయ్యింది. కాని అందులో సగం కూడా రంగస్థలం విషయంలో కనిపించకపోవడం చూస్తుంటే ఎంత బాధ్యతగా లేకుండా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. అర్జున్ రెడ్డి - ఆనందో బ్రహ్మ లాంటి సినిమాలే మిలియన్ మార్కును చేరుకుంటున్న ట్రెండ్ లో రంగస్థలం ఇంతగా కష్టపడటం లైట్ అని వదిలేయాల్సిన విషయం కాదు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇబ్బంది తప్పదు. అజ్ఞాతవాసి అంత పెద్ద డిజాస్టర్ అయినా పవన్ కున్న ఇమేజ్ దృష్ట్యా కేవలం ఓపెనింగ్స్ ద్వారానే 50 కోట్ల దాకా రాబట్టి నష్టాల శాతాన్ని తగ్గించింది. రామ్ చరణ్ కు ఇంకా అంత స్థాయి లేదు. మొదటి షో టాక్ అండ్ రివ్యూ ని బట్టే ఓవర్సీస్ లో జాతకం తలకిందులు అవుతుంది. అలాంటప్పుడు ముందు జాగ్రత్తగా అక్కడి డిస్ట్రిబ్యూటర్ తో నిర్మాతలు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకుని ఉంటే ఇప్పుడు ఇంత హైప్ లెస్ గా మూవీ ఉండేది కాదు అన్నది పచ్చి నిజం. మరి ఈ మూడు రోజులు ఏదైనా అద్భుతం చేస్తారా అని ఆశించలేం కాని ఈ వ్యవహారం పట్ల ఫాన్స్ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.