Begin typing your search above and press return to search.
మహేష్ టార్గెట్ పెరుగుతూ పోతోందిగా..
By: Tupaki Desk | 25 April 2018 10:38 AM GMTఏడాది కిందటి వరు అయితే మహేష్ బాబుకు మహేష్ బాబే పోటీ. తన సినిమా రికార్డును తానే బద్దలు కొట్టాల్సిన స్థితిలో ఉన్నాడు. మూడేళ్ల కిందట ‘శ్రీమంతుడు’తో నాన్-బాహుబలి రికార్డును నెలకొల్పాడు మహేష్. ఆ తర్వాత ఏడిన్నర పాటు వేరే హీరోలు కానీ.. అతను కానీ ఆ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. ‘బ్రహ్మోత్సవం’తో ఈ ప్రయత్నం చేసి ఘోరంగా విఫలమయ్యాడు మహేష్. ఇంతలో ‘ఖైదీ నంబర్ 150’ వచ్చి కొత్త రికార్డు నెలకొల్పింది. ‘స్పైడర్’ ఆ రికార్డును మహేష్ బద్దలు కొడతాడని అభిమానులు ఆశించారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు.
‘భరత్ అనే నేను’కు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే.. ‘శ్రీమంతుడు’ రికార్డును బద్దలు కొట్టడం పెద్ద విషయం కాదు. అది లాంఛనమే అని తేలిపోయింది. ‘ఖైదీ నంబర్ 150’ రికార్డు కూడా సాధ్యమన్నట్లే కనిపించింది. ఐతే మధ్యలో ‘రంగస్థలం’ వచ్చి వసూళ్ల వర్షం కురిపించింది. ‘భరత్ అనే నేను’ వచ్చే సమయానికి రూ.110 కోట్ల షేర్ మార్కును దాటేసింది. అదే పెద్ద టార్గెట్ అనుకుంటే.. క్రమ క్రమంగా ఆ టార్గెట్ పెరుగుతూ పోతోంది. ‘భరత్ అనే నేను’ వచ్చాక కూడా ఆ చిత్రం ఓ మోస్తరు వసూళ్లతో సాగుతుండటం విశేషం. షేర్ ఇంకా పెరుగుతూనే పోతోంది.
ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అటు అమెరికాలో ఈ చిత్రం బాగానే నడుస్తోంది. ఇప్పటికే షేర్ రూ.115 కోట్ల మార్కును టచ్ చేసినట్లు సమాచారం. ఐతే ‘భరత్ అనే నేను’ వీకెండ్ తర్వాత మరీ గొప్పగా ఏమీ వసూళ్లు రాబట్టట్లేదు. వంద కోట్ల షేర్ మార్కే కష్టమవుతుందేమో అనిపిస్తోంది. ‘ఖైదీ నంబర్ 150’ రికార్డును అందుకోవడమే సందేహంగా ఉంటే.. ‘రంగస్థలం’ను అందుకోవడం కష్టమే అంటన్నారు ట్రేడ్ పండిట్లు. మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందో చూడాలి.