Begin typing your search above and press return to search.

రంగ‌స్థ‌లం టార్గెట్ 80 కోట్లు

By:  Tupaki Desk   |   28 March 2018 8:15 AM GMT
రంగ‌స్థ‌లం టార్గెట్ 80 కోట్లు
X
రామ్‌ చ‌ర‌ణ్‌ - స‌మంతా - సుకుమార్ వంటి క్రేజీ కాంబినేష‌న్‌ లో తెర‌కెక్కిన సినిమా ‘రంగ‌స్థ‌లం’. సాధార‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి వంటి సినీ ప్రముఖులూ అత్యంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా - శుక్ర‌వారం విడుద‌ల కాబోతోంది. ఆకాశాన్ని అంటిన అంచ‌నాల‌కు త‌గిన‌ట్టుగానే ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జ‌రిగింది. మొత్తంగా క‌లిపి 115 కోట్ల‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే స‌గానికి పైగా వ్యాపారం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి 62 కోట్ల‌కు బ‌య్య‌ర్లు రంగ‌స్థ‌లాన్ని కొనుకున్నారు. రామ్‌ చ‌ర‌ణ్‌ కు -ద‌ర్శ‌కుడు సుకుమార్‌ కి మంచి ఫాలోయింగ్ ఉన్న నైజాంలో 18 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి ‘రంగ‌స్థ‌లం’ హ‌క్కులు. సీడెడ్‌ లోనూ బిజినెస్ 12 కోట్ల దాకా జ‌రిగింది. న‌వ్యాంధ్ర జిల్లాల్లోనూ ‘రంగ‌స్థ‌లం’ సినిమాకి భారీ స్థాయిలోనే గిట్టుబాటు జ‌రిగింది. ఒక్క వైజాగ్ హ‌క్కుల‌నే 8 కోట్ల‌కు అమ్మిన‌ట్టు స‌మాచారం. తూ.గో - ప‌.గో జిల్లాల్లో చెరో 5.4 కోట్లు - కృష్ణా జిల్లాలో 4.8 - గుంటూరులో 6.6 కోట్లు - నెల్లూరులో 3 కోట్ల‌కు వ్యాపారం జ‌రిగింది. అంతేకాకుండా క‌న్న‌డ గ‌డ్డ క‌ర్ణాట‌క‌లోనూ ‘రంగ‌స్థ‌లం’ సినిమాకు భారీ రేటు ల‌భించింది. ఏకంగా 7.6 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి క‌న్న‌డ రైట్స్‌. మిగ‌తా అన్ని రాష్ట్రాల్లో క‌లుపుకుని మ‌రో కోటిన్న‌ర వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

రామ్‌ చ‌ర‌ణ్‌ కు పెద్ద‌గా ఫాలోయింగ్ లేని ఓవ‌ర్సీస్‌ లోనూ ‘రంగ‌స్థ‌లం’ హ‌క్కులు 9 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. అక్క‌డ మాత్రం ద‌ర్శ‌కుడు సుకుమార్ క్రేజ్ కార‌ణంగానే ఇంత భారీ రేటు ప‌లికింద‌నేది సుస్ప‌ష్టం. థియేట్రిక‌ల్ రైట్స్ మొత్తం 80 కోట్లు కాగా - శాటిలైట్ రైట్స్ ద్వారా మ‌రో 20 కోట్లు - డ‌బ్బింగ్ హ‌క్కులు - ఇత‌ర హ‌క్కులు క‌లుపుకుని మ‌రో 15 కోట్ల దాకా వ‌చ్చింద‌ని అంటున్నారు. ఏదేమైనా ధియేటర్ల నుండి 80 కోట్లు షేర్ వసూలు చేయాల్సి ఉంది చరణ్‌. గెట్ రెడీ ఫర్ ధమాకా!!