Begin typing your search above and press return to search.

అరచేతిలో రంగస్థలం వచ్చేస్తోందా?

By:  Tupaki Desk   |   2 May 2018 10:18 AM GMT
అరచేతిలో రంగస్థలం వచ్చేస్తోందా?
X
డిజిటల్ హక్కుల రూపంలో ఆదాయం మాటేమో కానీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల నిర్మాతలకు మాత్రం ఇది రాను రాను కొత్త చిక్కులు తెచ్చేలా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కనక రంగస్థలం ఈ రేంజ్ లో ఇండస్ట్రీ హిట్ అవుతుంది ఏ మాత్రం ఊహించినా అమెజాన్ కు హక్కులు ఇచ్చే విషయంలో కాస్త ఆలోచించేవారేమో. కాని ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. రంగస్థలంని ఎప్పుడెప్పుడు అప్ లోడ్ చేద్దామా అని అమెజాన్ ప్రైమ్ ఉవ్విళూరుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఇప్పటిదాకా అమెజాన్ ప్రైమ్ కొని విడుదల చేసిన సౌత్ ఇండియన్ సినిమాలు అన్నింటిలోకి రంగస్థలమే పెద్ద హిట్టు. అంతకు ముందు అర్జున్ రెడ్డి విషయంలో కూడా అమెజాన్ ఇలాగే లాభ పడింది కాని ఇది స్టార్ హీరో మాస్ సినిమా కాబట్టి అన్ని రకాలుగా ఆదాయం లెక్కలు అంతకు పదింతలు ఉంటాయి.

ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం రంగస్థలం విడుదలైన 45 రోజుల తర్వాత ఎప్పుడైనా ఆన్ లైన్ లో రిలీజ్ చేసేలా అమెజాన్ రాయించుకుంది. అంటే మే 13కు ఆ గడువు తీరిపోతుంది. ఇంకో ఐదు రోజులు ఆగితే మే 18కి యాభై రోజులు కంప్లీట్ చేసుకుని అర్ధశతదినోత్సవ రికార్డును తన ఖాతాలో వేసుకుంటుంది. కాని ఆ లోపే రంగస్థలం హెచ్ డి వెర్షన్ ని ఆన్ లైన్ పెట్టేస్తే ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న రంగస్థలం వసూళ్ళపై తీవ్ర ప్రభావం చూపుతుందని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారట. కాని పరిస్థితి మైత్రి సంస్థ చేతిలో లేదని సమాచారం. సాధారణంగా అమెజాన్ ప్రైమ్ కేవలం 28 రోజుల గడువు మీదే ఒప్పందం చేసుకుంటుంది. ఒక్క రంగస్థలం విషయంలోనే ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు ఇంకా దాన్ని పోడిగించమంటే పాలసీల విషయంలో మహా కఠినంగా ఉండే అమెజాన్ రాజీ పడే సమస్యే ఉండదు. సో మే 13 నే వచ్చినా ఆశ్చర్యం లేదు. అన్నట్టు భరత్ అనే నేను హక్కులు కూడా అమెజాన్ వద్దే ఉన్నాయి. మరి దానికీ ఇంతే గడువు ఇచ్చారా లేదా ముందే వస్తుందా అన్నది మాత్రం సస్పెన్స్