Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: ఇంట గెలిచిన సౌండ్ ఇంజనీర్.. రచ్చ గెలుస్తాడా..??
By: Tupaki Desk | 21 April 2021 2:56 PM GMTమెగాపవర్ స్టార్ రాంచరణ్, స్టార్ హీరోయిన్ సమంత హీరోహీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం. 2018లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై ఆల్ నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సినిమాలో హీరో ఆది పినిశెట్టి, జగపతిబాబు, నరేష్, రోహిణి, పూజిత పొన్నాడ ఇలా చాలామంది పాపులర్ యాక్టర్స్ నటించిన ఈ సినిమా పల్లెటూరు జానపద నేపథ్యంలో తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీని మూడేళ్ల తర్వాత అంటే ఇప్పుడు తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా రంగస్థలం తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ తెలుగు జనాలకు తెలిసినప్పటికి తమిళ ప్రేక్షకుల కోసం అక్కడి అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేసినట్లు తెలుస్తుంది. నిజానికి తెలుగులో అరుదుగా వచ్చే ఇలాంటి రఫ్ అండ్ రస్టిక్ సినిమాలు తమిళంలో ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను తమిళంలో 7జి ఫిలిమ్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఇదివరకే రంగస్థలం సినిమాను మలయాళంలో కూడా రిలీజ్ చేశారు. అక్కడి ప్రేక్షకులను రంగస్థలం బాగానే ఆకట్టుకుంది. మరి తమిళంలో ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో.. ఏప్రిల్ 30న రంగస్థలం తమిళనాడులో 50% సీటింగ్ తో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం తమిళ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి సౌండ్ ఇంజనీర్ తమిళంలో రీసౌండ్ చేస్తాడేమో చూడాలి.