Begin typing your search above and press return to search.
రెండు రోజుల్లో చిట్టిబాబు వీరంగం
By: Tupaki Desk | 1 April 2018 7:30 AM GMT రంగస్థలం సునామి మామూలుగా లేదు. మాస్ సినిమాలు లేక కరువుతో అల్లాడుతున్న బాక్స్ ఆఫీస్ లెక్కలు మొత్తం చిట్టిబాబు సౌండ్ తో సెట్ అవుతున్నాయి. మొదటి రోజే 19 కోట్లకు పైగా షేర్ తో అదరగొట్టిన రామ్ చరణ్ రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తున్నాడు. కర్నూల్ లాంటి కేంద్రాల్లో మూడో రోజు కూడా ఉదయం 8 గంటలకే నాలుగేసి అదనపు షోలను మల్టీ ప్లెక్స్ లో సైతం వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందిన సమాచారం మేరకు రెండో రోజు రంగస్థలం 13.30 కోట్ల గ్రాస్ తో 8.8 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ టాక్. అంటే మొత్తంగా రెండు రోజులకు కలిపి 42 కోట్ల 30 లక్షల గ్రాస్ తో 27 కోట్ల 80 లక్షల షేర్ సాధించి సౌండ్ గట్టిగానే వినిపించింది. చరణ్ వీక్ అనుకునే ఓవర్సీస్ లో సైతం రంగస్థలం చెడుగుడు ఆడేసింది.
ఇప్పటికే ఓవర్సీస్ మిలియన్ మార్క్ మొదటి రోజే చేరుకున్న రంగస్థలం ఇప్పుడు రెండు మిలియన్ మార్క్ వైపు వేగంగా పరుగులు తీస్తోంది. గ్రామీణ నేపధ్యంలో రూపొందటంతో పాటు టెక్నాలజీ హంగులు ఏవి లేకుండా సహజ శైలిలో రూపొందిన మూవీ కావడంతో ఎన్ ఆర్ ఐలు బాగా కనెక్ట్ అవుతున్నారు. సుకుమార్ గత సినిమా నాన్నకు ప్రేమతోను పెద్ద మార్జిన్ తో దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తే మరో రెండు రోజల్లో 100 కోట్ల గ్రాస్ ను దాటేయడం కష్టం కాదు. ఏరియా వారిగా లెక్కలు చూసుకుంటే రెండు రోజులకు ఇలా ఉన్నాయి
నైజాం – 7.22 కోట్లు
సీడెడ్ – 5.50 కోట్లు
నెల్లూరు- 1.6 కోట్లు
గుంటూరు- 3.39 కోట్లు
కృష్ణా- 2.4 కోట్లు
వెస్ట్ – 2.12 కోట్లు
ఈస్ట్- 2.71 కోట్లు
ఉత్తరాంధ్ర- 3.77 కోట్లు
మొత్తం రెండు రోజుల షేర్ కలుపుకుని చూస్తే ఇప్పటి దాకా రంగస్థలం దాదాపు 27 కోట్ల 80 లక్షల షేర్ ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రాబట్టింది. సెలవుల నేపధ్యంలో స్పీడ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పుడు అభిమానులు ఖైది నెంబర్ 150 రికార్డులు బ్రేక్ చేస్తుందా లేదా అనే దాని గురించి ఎదురు చూస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర స్పీడ్ చూస్తుంటే అదేమి అసాధ్యం అనిపించడం లేదు. రేపటికి వీక్ ఎండ్ కలెక్షన్ రిపోర్ట్ చూసాక రేంజ్ గురించి ఇంకాస్త స్పష్టత వస్తుంది.