Begin typing your search above and press return to search.
సర్ ప్రైజ్... రంగస్థలంలో ఆరోపాట
By: Tupaki Desk | 15 March 2018 12:36 PM GMTరంగస్థలం సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోంది. అందుకే చిత్రయూనిట్ ప్రమోషన్లలో జోరు పెంచుతోంది. గురువారం మొత్తం పాటల జ్యూక్ బాక్సుకు విడుదలచేసినట్టు చెప్పింది చిత్రయూనిట్. కానీ ఒక సర్ ప్రైజ్ ను ఇంకా దాచింది. జ్యూక్ బాక్సులో అయిదు పాటలు ఉన్నాయి. సినిమాలో మాత్రం ఆరు పాటలు ఉంటాయి. ఆ ఆరోపాటను లైవ్ లో అభిమానుల ముందు విడుదలచేయనున్నారట.
రంగస్థలంలో ప్రస్తుతానికి విడుదలైన అయిదు పాటల్లో మూడు పాటలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక జిగేల్ రాణి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. కాగా ఆరో పాటను రచయిత చంద్రబోస్ రాసి... తానే పాడాడట. ఆ పాటను చిత్రయూనిట్ ఇంకా దాచిపెట్టింది. ఈ నెల 18న సినిమా ప్రి రిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ నెల 18న విశాఖలో ఘనంగా ఈ వేడుక జరగనుంది. రామ్ చరణ్ సమంత జగపతిబాబు వంటి నటులతో పాటూ చిరంజీవి కూడా ముఖ్య అతిధిగా పాల్గొనబోతున్నారు. ఆ వేడుకలోనే చంద్రబోస్ స్వయంగా పాటను పాడి విడుదల చేయనున్నారట. మరి ఆ పాటలో ఉన్న ప్రత్యేకతేంటో మరి మనకు ఆ రోజే తెలియనుంది. అన్నట్టు ఆ వేడుకలో దేవిశ్రీ లైవ్ షో కూడా ప్లాన్ చేశాడు. ఇంకే ఆరోజు మెగా అభిమానులకు కన్నుల పండుగే.
కాగా ఇప్పటి వరకు విడుదలైన పాటల్లో రంగమ్మా మంగమ్మా పాట కాస్త కాంట్రవెర్సీకి కారణమైంది. ఆ పాటలో గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే అనే వాక్యం ఉంది. గొల్లభామ అనే పదాన్ని తొలగించాలని కోరుతూ యాదవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే చిత్రం విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా అల్లు అర్జున్ సినిమా డీజేలో కూడా నమకం చమకం అనే పదాలు తొలగించాలని బ్రాహ్మణ సంఘాలు పట్టుబట్టాయి.