Begin typing your search above and press return to search.

రేంజ్ రోవ‌ర్ స‌రే ఇప్పుడు వంద కోట్లు ప‌ట్టాడు!

By:  Tupaki Desk   |   14 Feb 2022 2:12 AM GMT
రేంజ్ రోవ‌ర్ స‌రే ఇప్పుడు వంద కోట్లు ప‌ట్టాడు!
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన `ఖిలాడీ` ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో విడుద‌లై క్రిటిక్స్ నుంచి తీవ్ర విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. హీరో ఎలివేష‌న్ .. మాస్ అంశాలు .. గ్లామ‌ర్ కంటెంట్ బావున్నా కానీ ఈ సినిమాకి అవ‌స‌ర‌మైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ మిస్స‌య్యింద‌ని క‌థ‌ను నేరేట్ చేసిన విధానం ఏమంత క‌నెక్ట్ కాలేద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. ఇది పూర్తిగా ద‌ర్శ‌కుని ఫెయిల్యూర్ అంటూ క్రిటిక్స్ విమ‌ర్శించారు.

ఇక‌పోతే ఇంత‌కుముందు ఆడియో వేదిక‌పై ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌పై మాస్ రాజా పంచ్ ల గురించి తెలిసిన‌దే. రిలీజ్ ముందే రేంజ్ రోవర్ కొనిపించుకున్నాడ‌ని కూడా ద‌ర్శ‌కుడిపై చెణుకులు విసిరారు ర‌వితేజ‌. సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో ముందే ఊహించిన ర‌వితేజ అలా తెలివిగా సెటైర్లు వేశారంటూ టాక్ వినిపించింది. ఆ తర్వాత ఇది ఇరువురి న‌డుమా ఆర‌ని మంట‌గా మారింది. సోష‌ల్ మీడియాల్లో కామెంట్లు వైర‌ల్ అయ్యాయి.

అదంతా స‌రే .. ఈ ఎపిసోడ్ అంత‌టితో అయిపోలేదు. సినిమా రిలీజైంది. బాక్సాఫీస్ ఫ‌లితం రివ‌ర్స్ అయ్యింది. తానొక‌టి త‌లిస్తే అన్న చందంగా ర‌మేష్ వ‌ర్మకు నిరాశే ఎదురైంద‌ని ఫిలింన‌గ‌ర్ లో ఇత‌ర‌ జ‌నంలో టాక్ వినిపిస్తోంది. అయితే ద‌ర్శ‌కుడు వ‌ర్మ చెబుతున్న వెర్ష‌న్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఖిలాడీ మాస్ జ‌నం కోసం తీసిన‌ది. వారు సంతోషంగానే సినిమా చూస్తున్నారు. మేం విజ‌యం సాధించాం.. అని తెలిపారు. అంతేకాదు.. ఈ విజ‌యం నేప‌థ్యంలో త‌న‌తో ఇదే నిర్మాత వంద కోట్ల ప్రాజెక్ట్ చేస్తామ‌ని మాటిచ్చార‌ని కూడా ప్ర‌క‌టించారు.

నిజానికి సినిమా విడుదలకు ముందే ఆ చిత్ర నిర్మాత - కోనేరు సత్యనారాయణ ఒక అద్భుతమైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు. రమేష్ అవుట్ పుట్ తో మేకర్స్‌ని ఆకట్టుకున్నారని అందుకే ఖ‌రీదైన కానుకిచ్చారని ప్రచారం జరిగింది. కానీ అంతిమ ఫలితం వేరుగా ఉంది. ఖిలాడీ ద‌ర్శ‌కుడు చెబుతున్న దానికి బాక్సాఫీస్ రిజ‌ల్ట్ కి పొంత‌న లేద‌న్న తీవ్ర విమ‌ర్శ‌లు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.

దీనికి తోడు డీజే టిల్లు విజయం ఇప్పుడు ఖిలాడీ బాక్సాఫీస్ కి ఇబ్బందిక‌ర‌మైన‌ది అంటూ విశ్లేషిస్తున్నారు. కానీ రమేష్ వర్మ ఇప్పుడు ఖిలాడీ పబ్లిక్ హిట్ అని అన్నారు. దీనిపై పెద్ద వాదన కూడా చేసారు. ఖిలాడీ నిర్మాత ఈ చిత్రం పట్ల సంతోషంగా ఉన్నారని తనకు 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ను కూడా ఆఫర్ చేసినట్లు రమేష్ తెలిపారు. నిజంగానే ఆయ‌న అంత పెద్ద ఆఫ‌ర్ అందుకుంటే ఎంతో ల‌క్కీ అని ఇప్పుడు రివ‌ర్స్ పంచ్ లు ప‌డుతున్నాయి.

రాక్ష‌సుడు లాంటి రీమేక్ చిత్రంతో హిట్ కొట్టిన ర‌మేష్ వ‌ర్మ‌తో కోనేరు స‌త్య‌నారాయ‌ణ వెంట‌నే ఖిలాడీ లాంటి భారీ చిత్రం చేశారు. ఈ మూవీకి అసాధార‌ణ బ‌డ్జెట్ ని స‌మ‌కూర్చారు. కానీ దానిని నిరూపించుకోవ‌డంలో అత‌డు త‌డ‌బ‌డ్డాడ‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.