Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు క‌లిసి టార్చ‌ర్ చూపించారా?

By:  Tupaki Desk   |   1 Feb 2023 8:00 AM GMT
ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు క‌లిసి టార్చ‌ర్ చూపించారా?
X
ఈ మ‌ధ్య పేరున్న స్టార్ల సినిమాల‌కే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు. మ‌రీ కొత్త వారైతే అంతే సంగ‌తులు థియేట‌ర్ల‌లో ఈగ‌లు తోలుకోవాల్సిందే. అదే టాక్ బాగుందంటే మాత్రం స్టారా కాదా అని ప‌ట్టించుకోవ‌డం లేదు. థియేట‌ర్ల‌ల‌లో ఎగ‌బ‌డి చూసేస్తున్నారు. ఇందుకు రిష‌బ్ శెట్టి న‌టించిన `కాంతార‌`నే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌. ఇదిలా వుంటే పేరున్న న‌టులు, ద‌ర్శ‌కులు ఇవ‌న్నీ తెలిసి కూడా మ‌ళ్లీ మ‌ళ్లీ అవే త‌ప్పులు చేస్తూ ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారు.

త్రిష న‌టించిన సినిమానే ఇందుకు చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో త్రిష‌కు ఇప్ప‌టికీ మంచి క్రేజ్ వున్న విష‌యం తెలిసిందే. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌తో త‌న‌తో కొంత మంది ద‌ర్శ‌కులు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. తాజాగా త్రిష న‌టించిన లేటెస్ట్ మూవీ `రాంగి`. జ‌ర్నీ ఫేమ్ ఎం. శ‌ర‌వ‌ణ‌న్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీకి త‌న‌తో క‌లిసి పాపుల‌ర్ డైరెక్ట‌ర్ ఏ.ఆర్‌. మురుగ‌దాస్ క‌థ అందించారు.

ప్ర‌ముఖ లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీని నిర్మించింది. డిసెంబ‌ర్ 30న విడుద‌లైన ఈ సినిమాని తెలుగులో `రిపోర్ట‌ర్‌` పేరుతో సంక్రాంతి స‌మ‌యంలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ అక్క‌డే భారీ డిజాస్ట‌ర్ అనిపించుకోవ‌డంతో ఆ సాహ‌సం చేయ‌లేక‌పోయారు. సినిమాలో త్రిష ఆన్ లైన్ పోర్ట‌ల్ రిపోర్ట‌ర్ గా న‌టించింది. త‌న బంధువు అయిన ఓ యువ‌తి పురుతో లిబియాకు చెందిన టెర్ర‌రిస్ట్ ఫేస్ బుక్ ఫేక్ అకైంట్ ని క‌నిపెడుతుంది.

త‌న‌తో చాటింగ్ చేస్తూ అస‌లు విష‌యాన్ని రాబ‌ట్టే క్ర‌మంలో త్రిష అరెస్ట్ అవుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. దాని నుంచి తాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? .. ఇంత‌కీ లిబియా టెర్ర‌రిస్ట్ త్రిష‌కు తెలిసిన అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్ ని ఎందుకు క్రియేట్ చేశాడు? అత‌ని ప్ర‌ధాన ఉద్దేశ్యం ఏంటీ? అన్న‌దే అస‌లు క‌థ‌. ఓ ఆన్ లైన్ పోర్ట‌ల్ రిపోర్ట‌ర్ కు అంత‌ర్జాతీయ టెర్ర‌రిజాన్ని లింక‌ప్ చేస్తూ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు చెప్పాల‌నుకున్న క‌థ ఆడియ‌న్స్ కి సిల్లీగా అనిపించింది.

పేరున్న మురుగ‌దాస్‌, శ‌క‌ర‌వ‌ణ‌న్ ఇలాంటి సిల్లీ క‌థ కోసం లైకా వారి చేత కోట్లు ఖ‌ర్చ చేయించిన తీరు ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేయ‌క‌మాన‌దు. వీరిద్ద‌రు క‌లిసి ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేయ‌క‌పోగా త‌మ అతి తెలివితో టార్చ‌ర్ పెట్టార‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే తెలుగులో రిలీజ్ చేయాల‌నుకున్న మేక‌ర్స్ త‌మిళంలో డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకోవ‌డంతో ఈ మూవీని నేరుగా ఓటీటీలో విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.