Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ప్రేమ రంగులో రాట్నం

By:  Tupaki Desk   |   3 Jan 2018 1:14 PM GMT
ట్రైలర్ టాక్: ప్రేమ రంగులో రాట్నం
X
అసలు ఎవ్వరూ ఊహించని తరహాలో ఇప్పుడు రాజ్ తరుణ్‌ కొత్త సినిమా 'రంగుల రాట్నం' సంక్రాంతి రేసులోకి వచ్చేసింది. అక్కినేని నాగార్జున్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ (శ్రీరాఘవ) దగ్గర పనిచేసిన శ్రీరంజని అనే అమ్మాయి తెరకెక్కించింది. పదండి అసలు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

'జీవితం రింగు రింగులుగా తిరుగుతూనే ఉంటుంది' అని చెబుతూ.. నాగార్జున స్వయంగా ట్విట్టర్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఒక్కతే తల్లి.. ఆమెకు ఒక కొడుకు.. పేరు విష్ణు (రాజ్ తరుణ్‌). మనోడు కీర్తి ప్రేమలో పడతాడు. అయితే తల్లి చెప్పిన బ్లాక్ కలర్ టీషర్టు వేసుకోవడం మానడు.. అలాగే గుడికి వెళ్లడు. కాని ప్రియురాలు కోసం వేరే కలర్ టీషర్టులు.. అలాగే గుడికి వెళ్లడం.. అన్నీ చేయాల్సి వస్తుంది. ఈ ఫ్రస్టేషన్ ఆమెను వదిలేసి.. మళ్ళీ ఆమెనే కావాలనుకునే ప్రేమ. అందుకే ఇది రంగుల రాట్నం అయ్యింది. ప్రేమ అనే రంగులో రాట్నం అనమాట.

ఇకపోతే రాజ్ తరుణ్ ఎప్పటిలాగానే ఇంప్రెస్ చేశాడు. తొలిసినిమా 'మా అబ్బాయి'లో తన గ్లామర్ తో అరిపించిన చిత్రా శుక్లా ఈ సినిమాలో లుక్స్ అండ్ ఎక్స్ ప్రెషన్లతో ఆకట్టుకుంది. అలాగే తక్కువ బడ్జెట్లో తీసిన ఈ సినిమాకు శ్రీచరణ్‌ సంగీతం చాలా బాగుంది. చూస్తుంటే క్యూట్ ప్రేమకథలను కోరుకునే ఆడియన్స్ కు సంక్రాంతి నాడు మాంచి ఎంటర్టయిన్మెంట్ దొరికేసినట్లే అనిపిస్తోంది. అది సంగతి.