Begin typing your search above and press return to search.
రంగులద్దుకున్నా... మనసులో మరో 'ఉప్పెన' కలిగించేలా ఉంది
By: Tupaki Desk | 11 Nov 2020 2:50 PM GMTమెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న ఉప్పెన సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల విడుదల ఆగిపోయింది. అయితే సినిమా నుండి వచ్చిన నీ కన్ను నీలి సముద్రం మరియు ధక్ ధక్ పాటలు మంచి ఆధరణ సొంతం చేసుకుని సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటలు సినిమా స్థాయిని పెంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రెండు పాటలు వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత మూడవ పాట వచ్చింది. రంగులద్దుకున్న అంటూ సాగే ఈ మెలోడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ లిరికల్ సాంగ్ మరోసారి ఆడియన్స్ ను కట్టి పడేస్తుంది. పాటలోని సాహిత్యం మరియు హీరో హీరోయిన్ మద్య ఉండే చక్కటి కెమస్ట్రీ పాటలో చూపించడం జరిగింది. ఈ పాట ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ సాంగ్ గా మారుతుందని విన్న వెంటనే అనిపిస్తుంది. ఈమద్య కాలంలో సినిమాలు విడుదల లేవు. కనుక పాటలు కూడా పెద్దగా వచ్చింది లేదు. చాలా గ్యాప్ ర్వాత ఒక పెద్ద సినిమా నుండి వచ్చిన పాట అవ్వడంతో అన్ని చోట్ల కూడా ఇదే వినిపించే అవకాశం ఉంది.
మూడవ పాట ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన నేపథ్యంలో ఉప్పెన సినిమా విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లు ఓపెన్ కు రంగం సిద్దం అవుతున్న కారణంగా సినిమాను మళ్లీ జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ఇలా రంగులద్దుకున్న అంటూ ప్రేక్షకుల హృదయాల్లో మరో ఉప్పెన కలిగించే ప్రయత్నం చేశారు. ఉప్పెన సినిమాకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. వైష్ణవ్ తేజ్ కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.