Begin typing your search above and press return to search.

వాళ్ల ఆయ‌న‌కు అలా చేయ‌టం న‌చ్చ‌ద‌ట‌

By:  Tupaki Desk   |   21 March 2017 11:16 AM GMT
వాళ్ల ఆయ‌న‌కు అలా చేయ‌టం న‌చ్చ‌ద‌ట‌
X
అవ‌స‌ర‌మైతే గ్లామ‌ర్ ను.. సంద‌ర్భానికి త‌గిన‌ట్లుగా యాక్ష‌న్‌ను క‌ల‌బోయ‌టం కొంత‌మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. ఇలాంటి విల‌క్ష‌ణ‌త బాలీవుడ్ భామ రాణిముఖ‌ర్జీ సొంతం. పెళ్లి త‌ర్వాత కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తున్న ఆమెకు పెద్ద హిట్లు లేకున్నా.. ఏదో ఒక రోజు త‌న‌దైన రోజు వ‌స్తుంద‌న్న ప్ర‌య‌త్నం చేస్తోంది.

బాలీవుడ్ హీరోయిన్ గా పేరుప్ర‌ఖ్యాతుల్ని సొంతం చేసుకున్న ఆమె.. ఆదిత్య చోప్రాను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. 2015లో వారికి ఒక పాప పుట్టింది. బాలీవుడ్ ప్ర‌ముఖ‌ల పిల్ల‌ల ఫోటోలంటే ప్ర‌జ‌ల‌కు ఆస‌క్తి ఉన్న నేప‌థ్యంలో..ఒక‌సారి త‌న కుమార్తెను తీసుకొని కార్లోకి వెళ్లే సంద‌ర్భంలో పాప ఫోటోల కోసం ఫోటోగ్రాఫ‌ర్లు కాస్తంత అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించ‌టం.. దీనిపై రాణి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే.

ఫోటో ఫ్లాష్ ల‌తో పాప క‌ళ్లు డ్యామేజ్ కాదా? అంటూ సీరియ‌స్ అయిన ఆమె.. ఫోటోగ్రాఫ‌ర్ల‌ను తిట్టిపోసింది. త‌ర్వాత ఏమ‌నుకుందో ఏమో కానీ.. పాప తొలి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. త‌ర్వాత ఏమైందో కానీ.. పాప ఫోటోల‌ను పోస్ట్ చేయ‌టం బంద్ చేసింది. తాజాగా రాణి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆమె అభిమాని ఒక‌రు.. మీ అమ్మాయి లేటెస్ట్‌ ఫోటో పోస్ట్ చేయొచ్చుగా అన్న కోరిక‌ను కోరారు. దీనికి స్పందించిన ఆమె.. త‌న భ‌ర్త‌కు పాప ఫోటోల్ని పోస్ట్ చేయ‌టం న‌చ్చ‌ద‌ని.. ఆయ‌న చాలా ప్రైవేటుగా ఉండాల‌ని భావిస్తార‌ని.. ఆయ‌న నిర్ణ‌యాన్ని తాను గౌర‌విస్తాన‌ని చెప్పుకొచ్చింది. మొత్తానికి భ‌ర్త అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లే తాను న‌డుచుకుంటాన‌న్న విష‌యాన్ని రాణి ఎంత ప‌ద్ద‌తిగా చెప్పిందో క‌దా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/