Begin typing your search above and press return to search.
శ్రీదేవి మరణంపై నోరు విప్పి తిట్లు తింటున్న రాణి!
By: Tupaki Desk | 28 Feb 2018 8:03 AM GMTఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు. కానీ.. చెప్పే పరిస్థితిని చూసుకోవాల్సిన అవసరం ఉంది. వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నది తాజా ఉదంతం చూస్తే అర్థమవుతుంది. అతిలోక సుందరి శ్రీదేవి మరణం నేపథ్యంలో.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణిముఖర్జీ నోరు విప్పి విమర్శలపాలవుతోంది. దుబాయ్ టూర్ ముందు శ్రీదేవి తనకు ఫోన్ చేసిందని చెప్పిన రాణి ముఖర్జీ.. ఆ సందర్భంలో శ్రీదేవి తాను తాజాగా నటించిన సినిమాను చూడాలని ఉందని చెప్పినట్లుగా వెల్లడించారు.
దుబాయ్ ట్రిప్ కు వెళ్లి వచ్చిన తర్వాత తాను నటించిన తాజా చిత్రం చూపిస్తానని శ్రీదేవికి తాను చెప్పినట్లుగా చెప్పారు. రాణిముఖర్జీ నటించిన హిచ్ కి మూవీ మార్చి 23న రిలీజ్ కానుంది. ఈ సినిమాను చూడాలని శ్రీదేవి తనకు చెప్పిందన్నారు.
సమయం సందర్భం లేకుండా తన సినిమా ప్రమోషన్ కోసమే శ్రీదేవి మరణాన్ని రాణి ముఖర్జీ వాడుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సినిమా ప్రస్తావన తేవాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. కావాలనే సినిమా ప్రస్తావన తీసుకొచ్చి మైలేజీ పొందాలని రాణి ప్రయత్నిస్తోందని పలువురు తప్పు పడుతున్నారు.
ఇదిలా ఉంటే.. రాణి వాదన మరోలా ఉంది. దుబాయ్ ప్రయాణానికి తనతో శ్రీదేవి మాట్లాడింది కాబట్టి.. ఆ సందర్భాన్ని ప్రస్తావించానే తప్పించి మరింకేమీ లేదని ఆమె చెబుతోంది. దుబాయ్ నుంచి తిరిగి రాగానే తాను నటించిన సినిమాను శ్రీదేవికి చూపిస్తానని మాట ఇచ్చినట్లుగా రాణి చెబుతున్నారు.