Begin typing your search above and press return to search.
వారం వయసుకే రెండు బిల్డింగుల ఓనర్
By: Tupaki Desk | 12 Dec 2015 1:40 PM GMTబాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ, ప్రొడ్యూసర్ కం డైరక్టర్ ఆదిత్య చోప్రాలకు ఓ వారం క్రితం చిన్నారి పాప పుట్టింది. ఈ పసిపాపకు ముద్దుగా "ఆదిరా" పేరు పెట్టుకున్నారు. అంటే ఏంటో చెప్పలేం కానీ.. ఇలాంటి వెరైటీ పేరు పెట్టడానికి ఓ కారణం ఉంది. తండ్రి ఆదిత్య చోప్రా పేరులోంచి "ఆది"ని, తల్లి రాణి ముఖర్జీలోంచి "రా"ని కలిపితే ఆదిరా అయిందన్న మాట.
పేరు భలే వెరైటీగా సెట్ చేయడమే కాదు.. ఆ చిన్నారికి సూపర్బ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు రాణి దంపతులు. ముంబైలో జుహు అంటే అత్యంత లగ్జరియస్ ఏరియా. ఇక్కడ చిన్నపాటి అపార్ట్ మెంట్ కొనడం కూడా కోట్లలో వ్యవహారమే. అలాంటిది ఇక్కడ రెండు బిల్డింగులు కొని, ఆదిరా పేరుపై రాసేశారు రాణి ముఖర్జీ, ఆదిత్య చోప్రా. తమకు ఆదిరా మొదటి సంతానం కావడంతో.. తమ ప్రేమను చాటడానికి ఈ రూట్ ని ఎంచుకున్నారు వాళ్లిద్దరూ. ఈ రెండు బిల్డింగులు ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఆస్తి అయిన యష్ రాజ్ స్టూడియోకి అతి దగ్గరలో ఉంటాయి. అయితే.. ఇక్కడ నుంచి మరో రెండేళ్లపాటు రాణి ముఖర్జీ అన్ని రకాల యాక్టింగ్ ఫార్మాట్లకు సెలవు ఇచ్చేయనుంది. ఐశ్వర్యారాయ్ రూట్ లోనే మొదట కొన్నేళ్లు పిల్లనే అంటిపెట్టుకుని ఉండనుందన్న మాట.
అన్నీ బాగానే ఉన్నాయ్ కానీ.. ఈ జంట తమ సంతోషాన్ని పంచుకున్న తీరు మాత్రం ఎక్కువమందికి నచ్చలేదు. పది మందికి మంచి చేసేలా ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. అటు పెద్దలకు ఇటు పిల్లలకు వాళ్ల ఆశీర్వాదం ఉండేది కదా అంటున్నారు. అది కూడా నిజమే కదా.. వారం వయసులో రెండు బిల్డింగుల ఓనర్ అయితే మాత్రం.. ఆ పిల్ల వాటిని ఏం చేసుకోగలుగుతుంది. అదే ఏదన్నా అనాధ శరణాలయం లాంటి వాటికి భారీ డొనేషన్ ఇస్తే.. ఆ మంచి, పుణ్యం పిల్లలకు చెందుతాయ్ కదా.