Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ క‌బాలి లుక్ ఫేక్ గురూ

By:  Tupaki Desk   |   12 Sep 2015 9:59 AM GMT
ర‌జ‌నీ క‌బాలి లుక్ ఫేక్ గురూ
X
సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు లోక‌ల్‌ డాన్ క‌బాలీశ్వ‌రుని నిజ జీవిత క‌థ‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి పి.ఎ.రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌ణేష చ‌తుర్థి సంద‌ర్భంగా ఈనెల 17న ఠెంకాయ కార్య‌క్ర‌మం స‌హా ఫ‌స్ట్‌ లుక్‌ ని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమ‌వుతోంది. అయితే ఈలోగ‌నే ర‌జ‌నీ క‌బాలి లుక్ ఇదే అంటూ ఆన్‌ లైన్‌ లో ఓ పోస్ట‌ర్‌ ని వేశారు కొంటె కుర్రాళ్లు. ఈ పిక్ చూడ‌గానే సేమ్ టు సేమ్ ర‌జ‌నీకాంత్ పోలిక‌ల‌తో కినిపిస్తోంది. వెరీ స‌ర్‌ ప్రైజింగ్ అప్పియ‌రెన్స్ ఇచ్చింది.

హాలీవుడ్ యాక్ష‌న్ సినిమా ది డార్క్ నైట్ లో జోక‌ర్ విలన్‌ లుక్ పోలిక‌లు క‌నిపించాయి. విక్ర‌మ్ అప‌రిచితుడు చిత్రంలో చిట్ట చివ‌రిగా స్టేడియంలో క్లాస్ తీసుకునే సీన్‌ లో చియాన్ గెట‌ప్‌ ని గుర్తు చేసింది. పైగా ముఖంలో పోలిక‌లు అచ్చు గుద్దిన‌ట్టు ర‌జ‌నీనే పోలి ఉండ‌డంతో.. క‌బాలీ లుక్ అదిరిపోయిందంటూ స్పంద‌న వ‌చ్చింది. అయితే ఈ డిజైన్‌ ని చూసిన ద‌ర్శ‌కుడు రంజిత్ కంగారు ప‌డిపోయి.. అస్స‌లు ఈ పోస్ట‌ర్‌ కి ర‌జ‌నీకాంత్‌ కి ఏ సంబంధం లేద‌ని చెబుతున్నాడు. అది ఫేక్ ఫోటో న‌మ్మ‌కండి అని క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవ‌లి కాలంలో వీడియోల‌కు స్పూఫ్‌ లు - మార్ఫింగ్ బెడ‌ద అసాధార‌ణంగా ఉంది. సినిమా ప్రారంభానికి ముందే ఇలాంటి పోస్ట‌ర్ లు అభిమానుల్ని క‌న్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఒర‌జిన‌ల్ ఏదో - డూప్లికేట్ ఏదో క‌నిపెట్ట‌డ‌మే క‌ష్టంగా ఉంది.