Begin typing your search above and press return to search.

కాపీ సినిమా ను ఆస్కార్‌ కు పంపి పరువు తీశారు

By:  Tupaki Desk   |   18 Dec 2019 6:05 AM GMT
కాపీ సినిమా ను ఆస్కార్‌ కు పంపి పరువు తీశారు
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఫైర్‌ బ్రాండ్‌ గా పేరు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆమె స్టార్‌ హీరోలు స్టార్‌ డైరెక్టర్స్‌ ఇలా అందరిపై కూడా తన మనసులో ఉన్న మాటలు చెబుతూ విమర్శల చేసిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఇండస్ట్రీలో చాలా మందితో కంగనా కు విరోధం ఉంది. కంగనా దారిలోనే ఆమె సోదరి రంగోలీ కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా ఉంటుంది. వారసత్వంతో వచ్చిన స్టార్స్‌ పై పదే పదే వ్యాక్యలు చేస్తున్న రంగోలీ ఈసారి ఆస్కార్‌ ఎంట్రీస్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

హిందీ నుండి 'గల్లీ బాయ్‌' చిత్రాన్ని ఆస్కార్‌ రేసుకు పంపించిన విషయం తెల్సిందే. ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో మొత్తం 90 సినిమాలకు పైగా పోటీ పడ్డాయి. అందులో గల్లీ బాయ్‌ చిత్రం కూడా ఉంది. 90 సినిమాల్లోంచి చివరకు 10 సినిమాలను మాత్రమే ఫైనల్‌ జాబితాగా తయారు చేయడం జరిగింది. ఆ పది సినిమాల్లో ఒక్క సినిమాకు ఆస్కార్‌ దక్కుతుంది. అయితే తుది 10 సినిమాల జాబితాలో గల్లీబాయ్‌ కు చోటు దక్కలేదు.

గల్లీబాయ్‌ సినిమాపై రంగోలీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హాలీవుడ్‌ మూవీ 8మైల్‌ చిత్రంకు కాపీ అయిన గల్లీబాయ్‌ ను ఎలా ఆస్కార్‌ రేసుకు పంపించారంటూ ప్రశ్నించింది. కాపీ సినిమాను ఆస్కార్‌ నామినేషన్స్‌ కు పంపించి పరువు తీశారంటూ ఆమె ఇండియన్‌ ఆస్కార్‌ కమిటీపై కామెంట్స్‌ చేసింది.

ఆస్కార్‌ కు పంపించేందుకు ఉరి.. మణికర్ణికతో పాటు ఇంకా చాలా సినిమాలు మంచివి ఉన్నాయి. కాని వారికి మాత్రం గల్లీబాయ్‌ తప్పమరేది కనిపించలేదు. అక్కడకు వెళ్లిన గల్లిబాయ్‌ ను వారు కాపీ అంటూ తిరష్కరించారంటూ రంగోలి కామెంట్స్‌ చేసింది. బాలీవుడ్‌ లో ఎన్నో మంచి సినిమాలు వచ్చినా కూడా గల్లీబాయ్‌ ను పంపించి తప్పు చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.