Begin typing your search above and press return to search.

దీపికా.. ర‌ణ్ వీర్ ల పెళ్లి డేట్ ఫిక్స్‌!

By:  Tupaki Desk   |   22 Jun 2018 5:55 AM GMT
దీపికా.. ర‌ణ్ వీర్ ల పెళ్లి డేట్ ఫిక్స్‌!
X
బాలీవుడ్ లో ల‌వ్ బ‌ర్డ్స్ కు కొద‌వ‌లేదు. దాదాపుగా ఇక్క‌డి హీరోల‌కు.. హీరోయిన్ల‌కు లింకులున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తూనే ఉంటాయి.అయితే.. అన్ని ప్రేమ‌లు ఒక్క‌టిలా ఉండ‌వ‌న్న‌ట్లే.. బాలీవుడ్‌ లో ప్రేమ‌లు సైతం ఎక్కువ కాలం నిల‌వ‌వు. చూస్తున్నంత‌నే కాంబినేష‌న్లు మారిపోతుంటాయి.

అయితే.. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ కొన్ని ల‌వ్ స్టోరీలు ముందుకు సాగి.. పెళ్లి పీట‌ల మీద వ‌ర‌కూ తీసుకెళ్తాయి. అలాంటిదే బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకునే.. మ‌రో అగ్ర హీరో ర‌ణ్ వీర్ ల ల‌వ్‌ స్టోరీ పెళ్లి పీట‌ల‌కు వెళ్ల‌నుంది. వీరిద్ద‌రి పెళ్లి గురించి బోలెడ‌న్ని వార్త‌లు గ‌తంలో వ‌చ్చాయి. అయితే.. వీరి వెడ్డింగ్ లాక్ డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు.

తాజాగా.. న‌వంబ‌రు 10న వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని డిసైడ్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రో ప్రేమ‌జంట అనుష్క‌..కోహ్లీ మాదిరే వీరిద్ద‌రూ డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇట‌లీలో వీరి పెళ్లి జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే వీరిద్ద‌రి ఎంగేజ్ మెంట్ ర‌హ‌స్యంగా మాల్దీవ్స్ లో జ‌రిగింద‌న్న వార్త ఒక‌టి బాలీవుడ్ లో బ‌లంగా వినిపిస్తోంది. కుటుంబ స‌భ్యులు.. బంధుమిత్రుల మ‌ధ్య ఈ వేడుక జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇక‌.. త‌మ పెళ్లి కోసం ఈ ల‌వ్ బ‌ర్డ్స్ ఇప్పటికే షాపింగ్ మొద‌లెట్టార‌ని చెబుతున్నారు. పెళ్లిలో భాగ‌మైన మెహందీ.. సంగీత్ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన వేడుక‌ల్ని ఘ‌నంగా చేయ‌టానికి వీలుగా ప్లాన్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.