Begin typing your search above and press return to search.

ఆమె చీర సరి చేసి - చిలిపిగా..!

By:  Tupaki Desk   |   22 Nov 2018 5:19 AM GMT
ఆమె చీర సరి చేసి - చిలిపిగా..!
X
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రణ్‌ వీర్‌ సింగ్‌, దీపిక పదుకునేలా వివాహం ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్‌ లో ఇప్పటి వరకు ఏ జంటకు జరగని విధంగా ఈ స్టార్‌ కపుల్‌ ల వివాహం జరిగింది అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పెళ్లి ఏ స్థాయిలో అయితే జరిగిందో అదే స్థాయిలో వివాహ రిసెప్షన్‌ కూడా జరిగింది. బెంగళూరులో నిన్న అతిరథ మహారథులు హాజరు అవ్వగా జరిగిన వివాహ రిసెప్షన్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

కొత్త జంట ఆకర్షణీయమైన కాస్ట్యూమ్స్‌ లో అలరించడంతో పాటు, వచ్చిన గెస్ట్‌ లు అంతా కూడా కనువిందు చేశారట. ఇక ఈ రిసెప్షన్‌ లో రణ్‌ వీర్‌ సింగ్‌ ఒక చిలిపి పని చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. రిసెప్షన్‌ లో భాగంగా మీడియాకు ఫోజ్‌ లు ఇచ్చేందుకు స్టేజ్‌ వద్దకు రణ్‌ వీర్‌ - దీపిక పదుకునేలు వెళ్తున్న సమయంలో దీపిక చీర మడత పడిన విషయంను రణ్‌ వీర్‌ గుర్తించాడు. అప్పుడు ఆమె చీరను సరి చేసి, ఆమె వెనుక నుండి ఒక చిలిపి ఫోజ్‌ ను కెమెరా వారికి ఇచ్చాడు. దీంతో రణ్‌ వీర్‌ అప్పుడే దీపిక కొంగు పట్టుకుని తిరుగుతున్నాడని, చాలా చిలిపి అయ్యాడు అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

బెంగళూరు లీలా మహల్‌ హోటల్‌ లో జరిగిన వివాహ రిసెప్షన్‌ లో బాలీవుడ్‌ తారలు - కన్నడ సినీ ప్రముఖులు - క్రీడా కారులు - రాజకీయ ప్రముఖులు - వ్యాపార వేత్తలు ఎంతో మంది హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో తెలుగు బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె కాస్ట్యూమ్స్‌ ఆమె అలంకరణ అందరి దృష్టిని ఆకర్షించాయి.