Begin typing your search above and press return to search.

స్ర్కిప్టులో వేలెట్టాడు.. పొమ్మన్నారు!!

By:  Tupaki Desk   |   28 July 2017 1:52 PM GMT
స్ర్కిప్టులో వేలెట్టాడు.. పొమ్మన్నారు!!
X
హిందీలో ఇప్పుడు ఎనర్జి స్టార్ గా పేరు ఉన్న హీరో ఎవరు అంటే అందరూ చెప్పేది ఒక్క పేరే అదే రణవీర్ సింగ్. మనోడి క్రేజ్ చూసి కొత్త కొత్త బ్రాండ్లు వచ్చి ప్రచారం చేయమని కూడా అడుగుతున్నాయి. ఆ క్రమం లోనే సల్మాన్ ఖాన్ చేస్తున్న ఒక సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ కూడా రణవీర్ కు దక్కింది. అయితే ఇప్పుడు ఈ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ వాళ్ళు రణవీర్ సింగ్ ను మార్చేసి వేరేవాళ్ళను పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఎందుకో తెలుసా?

రణవీర్ సింగ్ ఇప్పుడు పద్మావతి సినిమా షూటింగ్లో బాగా బిజీ గా ఉన్నాడు. కోలా కంపెనీ వాళ్ళుకు రణవీర్ సింగ్ డేట్స్ తో ఇప్పుడు సమస్యలు వచ్చాయి అని తెలుస్తుంది. గడిచిన ఆరు నెలలలో రణవీర్ ఒక్క యాడ్ మాత్రమే షూట్ చేశాడట. దీపికా పడుకొనే , షాహిద్ కపూర్ కూడా నటిస్తున్న పద్మావతి సినిమాను సంజయ్ లీలా భాన్శాలి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ డేట్స్ వలన యాడ్స్ చేయలేకపోతున్నాడు అని తెలుస్తుంది. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం రణవీర్ సింగ్ కు వాళ్ళు యాడ్ తీసే విదానం నచ్చలేదట. దానిలో మార్పులు చేర్పులు చెబుతూ స్ర్కిప్టులో వేలు పెట్టాడట. మనోడు మార్చమంటే వాళ్ళు మార్చలేదు అని తెలుస్తుంది. దానితో రణవీర్ సింగ్ కు ఆ కోలా కంపెనీ వాళ్ళ కి మధ్య వైరం ఏర్పడిందట. ఈ సంఘటన తో ఆ సాఫ్ట్ డ్రింక్ వాళ్ళ రణవీర్ సింగ్ ని బ్రాండ్ ప్రచారకర్తగా తొలిగించే దిశగా అడుగులు వేస్తున్నారని టాక్.

ఆ బ్రాండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు కొత్త యంగ్ హీరో కోసం వెతుకుతునట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ కానీ వరుణ్ ధావన్ కానీ ఆ కోలా కంపెనీ యాడ్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలలో ఎక్కువ ఎండోర్సెమెంట్ లు చేస్తున్న రణవీర్ సింగ్ బ్రాండ్ లిస్ట్ లలో ఒకటి తగ్గబోతుంది అనమాట. ఒకవేళ అలా జరగకూడదంటే స్ర్కిప్టులో వేలు పెట్టడం తగ్గించుకోవాలి.