Begin typing your search above and press return to search.
#83 టీజర్: ఇండియా జిందాబాద్
By: Tupaki Desk | 26 Nov 2021 5:21 AM GMT2021-22 మోస్ట్ అవైటెడ్ మూవీస్ జాబితాలో ఆర్.ఆర్.ఆర్ తో పాటు మరో సినిమా పేరు కూడా ఉంది. అదే బాలీవుడ్ చిత్రం #83. టీమిండియాని ప్రపంచ చాంపియన్ గా నిలబెట్టిన ది గ్రేట్ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా .. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఇందులో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటించగా అతడి భార్యగా దీపిక పదుకొనే నటించింది. దీపిక ఈ సినిమాకి పెట్టుబడుల్ని సమకూర్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రాక కోసం క్రికెట్ లవర్స్ సహా సామాన్య జనం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
ఈ చిత్రం 10 ఏప్రిల్ 2020న విడుదల కావాల్సి ఉండగా.. దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా విడుదల ప్లాన్ విరమించారు. 83 పోస్టర్లు - స్టిల్స్ ఇప్పటికే విడుదలై ఆసక్తిని పెంచాయి.
అయినా ఈ చిత్రం 1983 క్రికెట్ ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా నమ్మశక్యం కాని విజయానికి సంబంధించినది కాబట్టి ఈ చిత్రం ఎల్లప్పుడూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. కేవలం యువకులే కాదు పాత తరం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో అన్నిరకాల అసమానతలకు వ్యతిరేకంగా భారతదేశం ఎలా గెలిచిందో పాతతరం జనం చూశారు.
తాజాగా 83 టీజర్ విడుదలైంది. వెస్టిండీస్ పై వరల్డ్ కప్ ఫైనల్ పోరులో టీమిండియా గెలుపునకు సంబంధించిన కీలక ఘట్టాన్ని ఆవిష్కరించింది ఈ టీజర్. ఈ టీజర్ లో నాటి విజయం తాలూకా ఉత్కంఠను కొన్ని సెకన్ల పాటు ఎగ్జయిటింగ్ విజువల్ రూపంలో చూపించిన తీరు ఆసక్తిని కలిగించింది. వెస్టిండీస్ ఆటగాడు బంతిని గాల్లోకి లేపగానే కపిల్ దేవ్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన తీరు ఉత్కంఠ కలిగిస్తుంది.
చివరికి విజయం ఇండియాని వరిస్తుంది. కెప్టెన్ కపిల్ అభినందనలు అందుకుంటారు. విక్టరీ ఆనందంలో స్టేడియంలో జనం ఇండియా జిందాబాద్ అంటూ నినదిస్తారు. ఈ ఘట్టాన్ని టీజర్ లో ఆవిష్కరించారు. ట్రైలర్ ని డిసెంబర్ 1న విడుదల చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తలైవి బయోపిక్ నిర్మాత విష్ణు ఇందూరి ఈ చిత్రానికి ఒక నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
రణ్ వీర్ సింగ్ -దీపికా పదుకొనే కాకుండా 83లో పంకజ్ త్రిపాఠి- తాహిర్ రాజ్ భాసిన్- అమ్మీ విర్క్- సాకిబ్ సలీమ్- హార్డీ సంధు- సాహిల్ ఖట్టర్ ఇతరులు కూడా నటించారు.