Begin typing your search above and press return to search.

25 రోజులు స్లంలో హీరో హీరోయిన్

By:  Tupaki Desk   |   3 Feb 2019 4:07 AM GMT
25 రోజులు స్లంలో హీరో హీరోయిన్
X
ఇప్పుడున్న స్టార్స్ ఎంత సుకుమారంగా తయారయ్యారో చూస్తూనే ఉన్నాం. పాత్ర డిమాండ్ చేస్తే ఎంతటి సాహసానికైనా కష్టానికైనా సిద్ధపడే ఆర్టిస్టులు తక్కువే. అయితే సహజత్వానికే ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్న తరుణంలో రిస్క్ కు రెడీ అనక తప్పడం లేదు. అసలు విషయానికి వస్తే ఈ నెల 14న రణ్వీర్ సింగ్ గల్లి బాయ్ విడుదల ఆవుతోంది. ఇప్పటికే మ్యూజిక్ ప్లస్ ట్రైలర్ భారీ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా ప్రమోషన్ లో యమా బిజీగా ఉన్న టీమ్ పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చూస్తున్నారు.

అందులో ముఖ్యమైనది లీడ్ పెయిర్ రణ్వీర్ సింగ్-అలియా భట్ ల కమిట్మెంట్ గురించి. కథ డిమాండ్ మేరకు ఈ ఇద్దరూ ముంబై ధారవి ప్రాంతంలో గల స్లం ఏరియాల్లో 25 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నారట. అందులో విశేషం ఏంటి అనకండి. ధారవి స్లంస్ అంటే మాములు మనుషులు అంత సులభంగా ఉండలేని ప్రాంతాలు. చాలా ఇరుకు సందులతో దుర్గంధం రాజ్యమేలుతూ అసలు అక్కడివాళ్లకు శుభ్రత అంటే ఏంటో తెలుసా అనుకునే రేంజ్ లో వాతావరణం ఉంటుంది. అలాంటిది కదలకుండా స్వర్గాన్ని తలపించే ఏసీ వ్యానిటీ వ్యానుల్లో సేదతీరే స్టార్స్ వాటిని తట్టుకోవడం ఈజీ కాదుగా.

అందుకే రణ్వీర్ అలియాల మీద యూనిట్ మెంబెర్స్ ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సింబా హిట్ తో రణ్వీర్ రాజీ బ్లాక్ బస్టర్ తో అలియా ఇద్దరూ మంచి జోష్ మీద చేసిన గల్లి బాయ్ కి దర్శకులు జోయా అక్తర్. ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. రెండు నెలలు దాటకుండానే రెండు సినిమాలు రావడం పట్ల రణ్వీర్ కూడా ఫుల్ ఎగ్జైటింగ్ తో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న గల్లి బాయ్ సున్నితమైన మతాంతర ప్రేమను ఓ సామాజిక సమస్యతో ముడిపెట్టి తీసినట్టుగా ముంబై టాక్. ఇది కూడా హిట్ కొడితే రణ్వీర్ అలియాలను పట్టుకోవడం కష్టమే.